ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన తెలుగు భాషకు లేడు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రముఖ తెలుగు రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేడు తెలుగు భాష ఖ్యాతిని దశ దిశల వినిపించేలా అనేక కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా విద్యాసంస్థలు అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ఈరోజు తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిర్వహిస్తారు. మాతృభాష అయినటువంటి తెలుగు భాషను మృత భాషగా మార్చకుండా ప్రతి ఒక్కరు తెలుగు భాషను కాపాడేందుకు ముందడుగు వేయాల్సిన సందర్భం ఇది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన భాషా సంస్కృతులే మన నిజమైన చిరునామా. భవిష్యత్ తరాలకు మన భాషా సంస్కృతుల వైభవాన్ని అందించేందుకు తెలుగు వారంతా పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

తేనెలా తియ్యనైనది తెలుగు భాష.. ప్రపంచం లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు

అమ్మ జన్మనిస్తే, అమ్మ నేర్పిన భాష మనస్సుని మెదడుకి అనుసంధానం చేసి జ్ఞానాన్ని ఇస్తుందని గ్రహించి గ్రాంథిక తెలుగుని వాడుకభాషగా మార్చి, రాష్ట్రవ్యావహారిక భాషగా చేసిన ఘనుడైన గిడుగు రామమూర్తి గారి జయంతే.. తెలుగు భాషా దినోత్సవం

"దేశ భాష లందు తెలుగు లెస్స" అని గొప్ప చక్రవర్తుల చేత సైతం పొగడబడిన మన తెలుగు భాష దినోత్సవం నేడు. మన తెలుగు భాషాభివృద్ధి కై పాటుపడిన మహామహులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.తెలుగు ప్రజలందరికీ "తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు".

తెలుగు భాషకు సరికొత్త వెలుగులు నింపిన మహనీయుడు గిడుగు వెంకట రామ్మూర్తి గారు. తెలుగు నేల ఎప్పటికి మిమ్మల్ని స్మరిస్తూనే ఉంటుంది.