Ugadi 2022 Messages: ఉగాది శుభాకాంక్షలు ఈ మెసేజ్‌లు ద్వారా చెప్పేయండి, శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలను తెలిపే కోట్స్ మీ కోసం
తెలుగు వారి పండుగలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది తీరే వేరు. ఈ పండుగ (Ugadi 2022) రోజున మనం 7 రుచుల పచ్చడిని తింటాం. అందులో తీపి, పులుపు, చేదు, వగరు ఇలా అన్నీ ఉంటాయి. మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ ఆ పచ్చడి ప్రతీక అనుకోవచ్చు.
తెలుగు వారి పండుగలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది తీరే వేరు. ఈ పండుగ (Ugadi 2022) రోజున మనం 7 రుచుల పచ్చడిని తింటాం. అందులో తీపి, పులుపు, చేదు, వగరు ఇలా అన్నీ ఉంటాయి. మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ ఆ పచ్చడి ప్రతీక అనుకోవచ్చు. ఉగాది పేరులోనే యుగ ఆది అనే అర్థం ఉంది. అంటే సంవత్సరం ప్రారంభం అని అర్థం. మన తెలుగు వారికి ఉగాదితోనే (Happy Ugadi) సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ఏడాది ఎవరి భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవడానికి పంచాంగం వినిపిస్తారు. ఈ సంవత్సరాన్ని శుభకృత నామ సంవత్సరంగా పిలుస్తున్నారు.
చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. 'ఉగాది', 'యుగాది' అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.
మీ మిత్రులకు ఈ మెసేజెస్ ద్వారా ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి








పాఠకులందరికీ లేటెస్ట్‌లీ తరపును ఉగాది శుభాకాంక్షలు
(The above story first appeared on LatestLY on Apr 01, 2022 07:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

