astrology

తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన ఉగాది పండుగ వచ్చేస్తోంది. ఏప్రిల్ 9న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటారు. ఈసారి తెలుగు ఏడాది శ్రీ ‘క్రోధి’నామ సంవత్సరంగా ప్రారంభం కాబోతుంది. ఈరోజు నుంచి సృష్టి మొదలైందని నమ్మకం అందుకే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు.అనంతరం ఉతికిన శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించి గడపకు పసుపు,కుంకుమ అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు. ఇంటి ముందు రంగు రంగులతో పెద్దగా ముగ్గులు వేస్తారు.

ఈరోజున అందరూ తమ భవిష్యత్తుకు సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఉగాది పండుగ రోజున దేవాలయాల్లో లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను (Ugadi Panchangam) నిర్వహిస్తారు. ఈ సమయంలో వచ్చే ఏడాది వరకు తమ రాశి ఫలాలు, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి.. ఏమైనా దోషాలుంటే నివారణలు తెలుసుకుంటారు.పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. ఏప్రిల్ 9న ఉగాదితో కొత్త ఏడాది ప్రారంభం..పంచాంగంలో ఈ 4 రాశుల వారికి డబ్బు విషయంలో తిరుగులేదు..

ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడానికి చేయడానికి కొన్ని నియమాలున్నాయి. అవి ఏమిటంటే..ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఆలయంలో లేదా ఎక్కడైనా సరే ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వినడం శుభమని పండితులు చెప్పారు. కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాశి ఫలాలు, స్థితిగతులను గురించి తెలుసుకుని అందుకు తగిన విధంగా శాంతులను చేసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేసి చెబుతారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతారని పెద్దలంటారు.

Astrology: ఏప్రిల్ 4 నుంచి వజ్ర యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి డబ్బు 

తెలుగు సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.తిధి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంగములు కలది కనుక ‘పంచాంగం’ అంటారు. మానవుల జీవితాల కాలంపైన, కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉంటుంది. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి జన్మించింది మొదలు మరణించే వరకూ గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం తిథి, వారం, నక్షత్రం బట్టి జాతక రచన జరుగుతుంది. వీటికి  పంచాంగమే ప్రమాణము.

ఉగాది రోజున సాయంత్రం దేవాలయాల్లో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని నమ్మకం. జ్యోతిష శాస్త్రం చెప్పే ఫలితాలను తెలుసుకుంటారు. కొత్త ఏడాదిలో తాము తీసుకోవాల్సిన లేదా చేయాల్సిన పనుల గురించి తగినట్లు ప్రణాళికలను రెడీ చేసుకుంటారు.