తెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు. ఉగాది పేరులోనే యుగ ఆది అనే అర్థం ఉంది. అనగా ఈ ఏడాది ప్రారంభమని.. మన తెలుగు వారికి ఉగాదితోనే సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది నాడు ఏ దేవుళ్లను పూజిస్తారో మీకు తెలుసా, విష్ణువు మత్స్య అవతారాన్ని ధరించి రాక్షసుడితో ఎందుకు యుద్ధం చేశాడు, పూర్తి కథనం ఇదిగో..
షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.మీ కోసం ఉగాది శుభాకాంక్షలు తెలిపే విషెస్, కోట్స్..

క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు


మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
