Vaikunta Ekadasi 2025 Wishes In Telugu: శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాల మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా. అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించి వారికి మీరు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. తద్వారా మీరు వారి నుంచి శుభాశీస్సులను పొందవచ్చు. శ్రీమహావిష్ణువు వైకుంఠ ఏకాదశి రోజున సమస్త లోకాన్ని రక్షించాడని ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదినం రోజున రోజంతా ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును స్తుతించడం ద్వారా మీరు పుణ్యఫలాలు పొందే అవకాశం ఉంటుంది. శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన మీరు దానధర్మాలు చేయడం ద్వారా సకల పుణ్యాలు లభిస్తాయి.
మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
ఓం నారాయణ విద్మహే వాసుదేవాయా ధీమహితన్నో విష్ణు ప్రచోదయాత్
ఆ దేవ దేవుడి కృపా కటాక్షాలు అనునిత్యం అందరిపై ఉండాలని కోరుతూ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి ఉపక్రమించి భక్తుల వరాలు తీర్చే శుభదినం వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి). ఇటువంటి శుభదినాన లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
ఆ వైకుంఠ నాధుని ఆశీస్సులు ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ.. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని మంగళకరమైన దీవెనలు ప్రజలందరికీ కలగాలని ఆ వైకుంఠ నాధుడిని కోరుకుంటూ.. ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.