Valentine’s Day Wishes in Telugu: ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ప్రేమ ఒక వెలకట్టలేని సంపద. నిస్వార్థమైన, నిజాయితితో కూడిన ప్రేమ ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపించగల కనిపించని భావోద్వేగమే ప్రేమ. ఏ బంధమైన వికసించాలన్నా , ఆ బంధం చిరకాలం నిలవాలన్నా ప్రేమే మార్గం. అది ఇద్దరు వ్యక్తుల మధ్య అయి ఉండవచ్చు, లేదా కుటుంబం, సమాజం మీద అయి ఉండవచ్చు.
నిజమైన ప్రేమ పొందాలంటే అది ధనంతోనో, బలంతోనే దక్కించుకునేది కాదు. అలా పొందిన ప్రేమ అసలు ప్రేమే కాదు. నిజమైన ప్రేమ నిజంగా ప్రేమించడం ద్వారానే జయించగలం.కొందరికి ప్రేమ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది, మరికొందరికి అదే ప్రేమ జీవితంలో పైకి ఎదిగేలా చేస్తుంది. ప్రేమలో ఓడిపోవడం, గెలవడం అంటూ ఉండవు. ఆ ప్రేమ పంచిన అనుభూతులు ప్రతి ఒక్కరి జీవితంలో పదిలం, శాశ్వతం. ప్రేమ అనేది మనలో, ప్రతి జీవిలో ఉండే దైవత్వం.
నువ్వు లేని ప్రతిరోజు నేను నా జీవితాన్ని వదిలేసుకునే రోజే అవుతుంది బంగారం. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు
నిద్రపోవడానికి ముందు నా చివరి ఆలోచన నువ్వే.నిద్ర లేచాక నా మొదటి ఆలోచన నువ్వే. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు
నీ దగ్గర ఉన్నంత చనువుగా నేను ఎవరి దగ్గర ఉండలేను బంగారం. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు
నీ దగ్గర ఉన్నంత చనువుగా నేను ఎవరి దగ్గర ఉండలేను బంగారం. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు