Ayudha Pooja 2022: నేడే ఆయుధ పూజ, అసలు ఆయుధ పూజ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ప్రాముఖ్యతను తెలుసుకుందాం...
file

దుర్గాష్టమి  రోజు విజయాన్ని కాంక్షిస్తూ, ఆయుధ పూజలు కూడా చేస్తారు. రావణుడిని చంపే ముందు శ్రీరాముడు కూడా తన ఆయుధాన్ని ఈ రోజు పూజించాడు. విజయం సాధించాలని కోరుతూ ఈ పూజ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజలు చేస్తారు.  దాని పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం.

దుర్గాష్టమి రోజున ఆయుధాలు, పరికరాలు, వాహనాలు, పారిశ్రామిక వాడల్లో సామగ్రికి పూజలు కూడా పూజ చేస్తారు. శ్రీరాముడు లంకను జయించే ముందు ఈ రోజు తన ఆయుధాలకు పూజ చేశాడు. ఆయుధ పూజ ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కేరళలో నిర్వహిస్తారు , చాలా ప్రాంతాలలో ఆయుధ పూజను, శాస్త్ర పూజ లేదా అస్త్ర పూజ అని కూడా అంటారు. ప్రధానంగా ఈ రోజున ప్రజలు తమకు జీవనోపాధి కల్పించే వస్తువులన్నింటికీ పూజలు చేస్తారు. వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు, వ్యవసాయ పనిముట్లు, ఫ్యాక్టరీల్లో మెషీన్స్, అలాగే ఇతర సామాగ్రిని పూజిస్తారు. ప్రజలు ఏ పని చేసి జీవిస్తున్నారో ఆ పనిముట్లను పూజిస్తారు.

మీకు, మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ తరుఫున సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.. మీ ఫ్రెండ్స్ కి కిందనున్న హెచ్ డీ ఇమేజెస్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..

పూజకు ముందు, పూజించవలసిన సామగ్రి శుభ్రం చేస్తారు. ఇల్లు, దుకాణం, కార్యాలయాలు శుభ్రం చేసిన తర్వాత పూజ చేస్తారు. అదే సమయంలో, విద్యార్థులు తమ పుస్తకాలను కూడా ఈ రోజున పూజిస్తారు.

ఆయుధపూజ రోజున వాహనాలను అలంకరిస్తారు. మామిడి ఆకులు , అరటి ఆకులతో అలంకరిస్తారు. ధూపం-దీపం , అగరబత్తీల ద్వారా, భగవంతుని పనిలో విజయం సాధించాలని కోరుకుంటారు. అనంతరం ప్రసాదం అందజేస్తారు.