Gold Price, Representational Image | Photo Credits; IANS

వచ్చే ఫిబ్రవరి 1 నుంచి మాఘమాసం వచ్చేస్తోంది. దీంతో వివాహాల సీజన్ ప్రారంభం అవుతుంది. దీంతో చాలా మంది బంగారు ఆభరణాల కొనుగోలును స్టార్ట్ చేసేస్తారు. మరోపక్క బంగారం ధరలు కూడా పైపైకి ఎగసి పడుతున్నాయి. ఎప్పుడైనా బంగారం కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఎందుకంటే మార్కెట్లోకి నకిలీ బంగారం వస్తోంది. బంగారం నిజమో, నకిలీదో గుర్తించడానికి చాలా సులభమైన మార్గం ఉంది. నకిలీ బంగారాన్ని గుర్తించడానికి కొన్ని సులభమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం హాల్‌మార్క్ బంగారం తప్పనిసరి చేసింది. హాల్‌మార్క్‌ల ద్వారా నిజమైన బంగారం సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి హాల్‌మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనండి. మీరు కొన్న బంగారంపై హాల్ మార్క్ ఉన్నదీ లేనిదీ కచ్చితంగా పరిశీలించండి. తరువాతే బంగారం కొనుగోలు చేయండి. అసలు హాల్‌మార్క్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క త్రిభుజాకార గుర్తును కలిగి ఉంటుంది. హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోతో పాటు బంగారం స్వచ్ఛత కూడా రాసి ఉంటుంది.

>> నకిలీ బంగారం వెనిగర్‌తో కూడా గుర్తించవచ్చు. బంగారు ఆభరణాలపై కొన్ని చుక్కల వెనిగర్ వేయండి, రంగు మారకపోతే, అది నిజమైన బంగారంగా గుర్తించవచ్చు.

>> బంగారు ఆభరణాలను పిన్‌తో తేలికగా గీసుకోండి. తర్వాత ఆ స్క్రాచ్‌పై నైట్రిక్ యాసిడ్ చుక్క వేయండి. బంగారం నకిలీదైతే దాని రంగు వెంటనే ఆకుపచ్చగా మారుతుంది.

>> బంగారం చెమటతో తాకినప్పుడు నాణెం వంటి దుర్వాసన వస్తే, అది కల్తీ అని అర్థం. అసలు బంగారం ఎట్టి పరిస్థితిలోనూ వాసన రాదు.

>> ఒక కప్పు నీటిలో బంగారాన్ని ఉంచండి. నకిలీ బంగారం తేలికగా తేలుతుంది. నిజమైనది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది.

>> బంగారం ఎల్లప్పుడూ విశ్వసనీయ దుకాణం నుండి కొనుగోలు చేయండి. ఎందుకం, మంచి దుకాణాలు బంగారం యొక్క వాస్తవికత గురించి అవసరమైన అన్ని పత్రాలను ఇస్తాయి.

>> అయస్కాంతం ద్వారా కూడా నకిలీ బంగారాన్ని గుర్తించవచ్చు. బంగారు ఆభరణాలపై అయస్కాంతం ఉంచండి, అది అంటుకుంటే, బంగారం నకిలీ కాదు, అది నిజమైనది.

>> మీరు కొన్న బంగారానికి సంబంధించి కచ్చితంగా బిల్లు తీసుకోండి. బిల్లులో మీరు కొన్న బంగారానికి సంబంధించిన అన్ని వివరాలనూ నమోదు చేసేలా దుకాణ దారుని కోరండి.