Food Tips: పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అయినా పెద్దవాళ్లకైనా ప్రోటీన్ ఉన్న ఆహారాలు చాలా ముఖ్యం. ఇది కండరాల నిర్మాణానికి శరీర ఎదుగుదలకు సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ల కంటే కూడా ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల్లో పెద్దల్లో అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి. ప్రోటీన్ అధికంగా తీసుకోవడం ద్వారా బరువు కూడా పెరగరు. అంతే కాకుండా కండరాలకు చాలా మంచిది. అయితే సాయంత్రం పూట ఈజీగా హెల్తీగా చేసుకునే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న స్నాక్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే దీనికి కావలసిన పదార్థాలు దీన్ని తయారీ విధానం తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు..
శనగలు- ఒక కప్పు
ఆయిల్- వన్ టీ స్పూన్
జీలకర్ర -వన్ టీ స్పూన్
ఉల్లిపాయ -ఒకటి
టమాటో -ఒకటి
కరివేపాకు- ఒక స్పూను
నిమ్మకాయ- అర చెక్క
కొత్తిమీర- ఒక స్పూను
ఉప్పు రుచికి -తగినంత
పసుపు- చిటికెడు
కారం-అర టీ స్పూన్
Health Tips: చక్కెరను అతిగా వాడుతున్నారా,
తయారీ విధానం.
ముందుగా ఒక కప్పు శనగలను రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటిని మధ్యాహ్నం లంచ్ తర్వాత నానబెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకు ఈ స్నాక్స్ ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా వీటిని రెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. శనగలను వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాని పెట్టుకుని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్, జీలకర్ర, కరివేపాకు వేసి చిటికెడు పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న శనగలను అందులో వేసి ఒక రెండు నిమిషాల పాటు కలపాలి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు కారము ఉల్లిపాయ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. దీనివల్ల పుల్ల పుల్లగా రుచి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. దీంట్లో చివరిగా నిమ్మ రసాన్ని పిండుకుంటే ఎంతో టేస్టీ ఎంతో హెల్తీ అయినా ప్రోటీన్ అధికంగా ఉన్న స్నాక్స్ రెడీ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకు జంక్ ఫుడ్ బదులు ఇది ఇచ్చినట్లయితే వీరి ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి.