రోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టినప్పుడు మనకు కాస్త వెరైటీగా ఫుడ్ తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా కరకరలాడే టేస్టీగా ఉండే ఫుడ్ ను తినాలని అందరూ కోరుకుంటారు. అయితే దీని కోసం ప్రత్యేకంగా వేరే పిండిని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇడ్లీ పిండితోనే టేస్టీగా పునుగులు చేసుకోవచ్చు. దీని కోసం తెగ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే సింపుల్ గా ఉన్న ఆహార పదార్థాలను చేసి వీటిని తయారు చేసుకోవచ్చు .అయితే దాని తయారీ విధానం కావాల్సిన పదార్థాలు దాని ప్రాసెస్ తెలుసుకుందాం.
Health Tips: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ...
కావలసిన పదార్థాలు.
ఇడ్లీ పిండి ఒక కప్పు బియ్యప్పిండి రెండు స్పూన్లు ఉప్పు తగినంత పచ్చిమిర్చి తగినంత ఉల్లిపాయ పావు కప్పు జీలకర్ర క్యారెట్ అల్లం కొత్తిమీర.
తయారీ విధానం- ఇడ్లీ పిండిని తీసుకొని దాంట్లో పునుగుల కోసం ఇడ్లీ పిండిని కావాల్సినంత బియ్యప్పిండి వేసుకొని కాస్త గట్టిగా కలుపుకోవాలి. దీన్ని ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ చేసి వేసుకోవాలి. అంతేకాకుండా దీంట్లో కొంచెం అల్లం తురుము, ఉప్పు, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము ఉల్లిపాయలు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో పొంగడం కోసం కొద్దిగా వంట సోడాను ఉపయోగించుకోవచ్చు. అయితే కొంతమందికి అల్లము వేయడం అంత ఇష్టము అనిపించదు. ముఖ్యంగా పిల్లలు దీనికి అంత ఇష్టపడరు. కాబట్టి దీనిని ఆప్షనల్ గా వేసుకోవచ్చు. తర్వాత ఈ పిండిని కాస్త కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కకు పెట్టుకొని ఒక బౌల్ లో డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె పోసుకొని దాన్ని కాగనివ్వాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న పునుగులు లాగా వేసుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకోవాలి. వేడివేడిగా టేస్టీ పునుగులు రెడీ. వీటికి కాంబినేషన్ గా టమాటా పచ్చడి, కానీ కొత్తిమీర పచ్చడి కానీ పల్లి చట్నీ గాని చేసుకొని తింటే చలికాలంలో వేడివేడిగా చాలా టేస్టీగా తొందరగా అయిపోయే ఈజీ స్నాక్ ఐటమ్ రెడీ.