Sankranthi Foods: సంక్రాంతి పండగ అంటే చాలు పందెం కోళ్ల హడావుడి గాలిపటాలు ఎగిరేయడం, ఎద్దుల పోటీలు, ముగ్గుల పోటీలు, భోగి మంటలు, బసవన్నల ఆటలు, హరిదాసు కీర్తనలతో చాలా కోలాహలంగా ఉంటుంది. అయితే కనుమ రోజు నాటుకోడి పులుసును చేసుకుంటే ఎంతో రుచిగా బాగుంటుంది. అయితే కనుమ రోజున చేసుకునే నాటుకోడి పులుసు తయారీ తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు..
నాటుకోడి చికెన్- 1/2 కేజీ.
అల్లం వెల్లుల్లి- పేస్ట్ రెండు స్పూన్లు
ఉల్లిగడ్డలు -ఒకటి
టమాటాలు- రెండు
పుదీనా- రెండు స్పూన్లు
కొత్తిమీర రెండు స్పూన్లు
గరం మసాలా -రెండు టీ స్పూన్లు
జీలకర్ర పొడి -ఒక టీ స్పూను
పెరుగు రెండు- టీ స్పూన్లు
నిమ్మరసం ఒక స్పూను
కారం -రెండు టీ స్పూన్లు
ఉప్పు-, రుచికి సరిపడినంత
పసుపు- చిటికెడు
ఆయిల్- రెండు టీ స్పూన్లు.
Health Tips: టీ అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంత అనర్ధమో ...
తయారీ విధానం.. నాటుకోడి పులుసును తయారు చేసుకోవడం చాలా ఈజీ ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పెరుగు గరం మసాలా పొడి జీలకర్ర పొడి కలిపి మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టే ఇందులో ఉన్న మసాలాలు అన్నీ కూడా నాటుకోడికి బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకుని అందులో రెండు టీ స్పూన్ల నూనె పోసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,వేసుకోవాలి. ఇవి రెండు కొంచెం వేడి అయ్యాక ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ వేయాలి. వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో టమాటాలను ముక్కలను కూడా ఒక ఐదు నిమిషాల తర్వాత వేసుకోవాలి. తర్వాత ఇవి మగ్గాక ఇందులోనే కాస్త నీరు పోసుకోవాలి. పోసుకొని ఇప్పుడు ఇంకాస్త సేపు మరిగించాలి. నాటుకోడి కాస్త గట్టిగా ఉంటుంది .కాబట్టి ఉడకడానికి కాస్త సమయం పడుతుంది. ఇది ఒక పావుగంట తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇందులో కొత్తిమీర పుదీనా తురుము వేసుకొని జీలకర్ర పొడి చివర్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టుకోవాలి. వేడివేడిగా ఎంతో టేస్టీ అయిన నాటుకోడి పులుసు రెడీ కనుమ రోజు దీన్ని గారెలతో పాటు నాటుకోడి పులుసు కాంబినేషన్స్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.