 
                                                                 ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మందికిపైగా డయాబెటిస్ బారిన పడే ప్రమాదమున్నదని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది. ఇందులో టైప్-2 డయాబెటిస్ వారి సంఖ్యే ఎక్కువగా ఉండనుందని పేర్కొన్నది. కాగా మధుమేహులకు గుండెజబ్బులు, స్ట్రోక్, ఫుట్ అల్సర్, కంటిచూపు కోల్పోవడం వంటి ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సరైన అవగాహన, చికిత్స లేకపోవడం వల్ల అనేక మంది ఈ వ్యాధులకు గురవుతున్నారు.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, వయసు, ఒబెసిటీ తదితర కారణాల వల్ల మధుమేహం బారిన పడుతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రీడయాబెటిస్ను ముందే గుర్తిస్తే డయాబెటిస్ ముప్పు బారిన పడకుండా చూడొచ్చని తెలిపింది
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
