Jamun fruit (Photo Credits: Wikimedia Commons)

నేరేడు చెట్టు గురించి చాలామంది వినే ఉంటారు.నేరేడు కాయలు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చెట్టు ఆకులు (Jamun Leaves), నేరేడు పండ్లు ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా (Health Benefits Of Jamun Leaves) పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నేరేడు విత్తనాలు, పొడపత్రి కాచు, పసుపు, ఎండు ఉసిరిక కలిపి చూర్ణం చేసుకుని దాన్ని చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే మధుమేహం అదుపులో వుంటుందని వైద్యులు చెబుతున్నారు.

నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమితే కదిలే దంతాలు చాలా గట్టిపడతాయని అంటున్నారు.

వీర్యం చిక్కబడాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే, అలాగే ఈ అలవాట్లు మానకపోతే మగతనానికి ప్రమాదం.

ఇక నేరేడు చెక్క కషాయాన్ని పుక్కిలిపడితే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయట. నేరేడు ఆకు చిగుళ్లు, మామిడి ఆకు చిగుళ్లు తీసుకుని వాటితో కషాయం కాచుకుని, దానిలో తేనె చేర్చి సేవిస్తే పైత్యపు వాంతులు వెంటనే తగ్గిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కిడ్నీలో రాళ్లు వున్నవారు నేరేడు పండ్లు తింటే అవి కరిగిపోవడమే కాదు మరోసారి రాళ్లు ఏర్పడే అవకాశమే వుండదు.అయితే ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా వైద్య సలహాలు తీసుకున్న తర్వాత నేరేడు పండ్లను తినాలి.