Coronavirus Outbreak: కరోనా నుంచి కోలుకున్న వారిలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు, శరీరంలోని పది అవయవ వ్యవస్థల్లో సుదీర్ఘ కాలం పాటు 203 లక్షణాలు, లాన్సెట్‌ తాజా అధ్యయనంలో వెల్లడి
Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

London, July 20: కరోనా నుంచి కోలుకున్నవారికి షాకింగ్ న్యూస్. కోవిడ్ (Coronavirus Outbreak) నుంచి కోలుకున్నాక సుదీర్ఘ కాలం పాటు శరీరంలోని పది అవయవ వ్యవస్థల్లో (ఆర్గాన్‌ సిస్టమ్స్‌) 203 లక్షణాలు (More Than 200 Symptoms) ప్రబలంగా కనిపిస్తున్నట్లు లాన్సెట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటివరకు అంతగా బయటపడని కొత్త అలర్జీలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, కంటిచూపు మందగించడం, వినికిడి శక్తి బలహీన పడటం, ముఖ పక్షవాతం వంటి కొత్త సమస్యలు వెలుగులోకి వచ్చాయి.

యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తల ఆధర్యంలో మొత్తం 56 దేశాల్లో ఎక్కువ కాలం కోవిడ్‌తో (Coronavirus for Longer Time) బాధపడుతున్న దాదాపు 4 వేల మందిపై ఈ పరిశోధన జరిపారు. భవిష్యత్‌లో వచ్చే కరోనా వేవ్‌లను ఎదుర్కోవడంతో పాటు వైద్య వ్యవస్థపై కోవిడ్‌–19కు సంబంధించిన ప్రభావాలు, పరిణామాలను అంచనా వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా కరోనా నుంచి బయటపడ్డాక పూర్తిగా కోలుకునేందుకు 91 శాతం పైగా మందికి 35 వారాలకు పైగా పడుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.

మళ్లీ ఇంకో కొత్త వైరస్, యూకేని వణికిస్తున్న నోరో వైరస్‌, ఐదు వారాల్లోనే 154 కేసులు నమోదు, నోరో వైరస్‌ లక్షణాలు ఏంటి, అది ఎలా వ్యాప్తిస్తుంది, నోరోవైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి

మొత్తం 4 వేల మందిలో రెండున్నర వేల మంది 6 నెలల దాకా కోవిడ్‌కు సంబంధించిన కొన్ని లక్షణాలతో బాధపడినట్లు తేల్చింది. కోవిడ్‌ తగ్గాక 4 వారాలు అంతకుమించి ఎక్కువ కాలానికి అనారోగ్య సమస్యలు, కరోనా లక్షణాలున్న వారిని ‘లాంగ్‌ కోవిడ్‌’తో బాధపడుతున్న వారిగా యూఎస్‌ ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ పేర్కొన్న విషయం తెలిసిందే.

కోవిడ్‌ నుంచి కోలుకున్న వారికి కనిపించే లక్షణాలు

అలర్జీలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, కంటిచూపు మందగించడం, వినికిడి శక్తి బలహీనపడటం, ముఖ పక్షవాతం, ‘సీజర్స్‌’, ‘అనాఫైలాక్సిస్‌’ వంటి కొత్త లక్షణాలు బయటపడ్డాయి. సాధారణంగా ఎక్కువమంది నీరసం, అలసట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, తగ్గిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, జలుబు, తలనొప్పి, మహిళల రుతుక్రమంలో మార్పులు, వివిధ శారీరక బలహీనతలు, లైంగికపరమైన సమస్యలు, రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలతో బాధపడుతున్నారని స్పష్టం చేసింది.