Do you sleep with mouth open,Is it Unhealthy

August 15:  మీరు కానీ మీ ఇంట్లో వారు కానీ నోరు తెరచి నిద్రపోతున్నారా?,అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే?, అనారోగ్య సమస్యలు మీ చుట్టూ ఉన్నట్లే?,ఇంతకీ నోరు తెరచి నిద్రపోతే జరిగే అనార్థాలు ఏంటో తెలుసా?, ఓ స్టడీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

నోరు తెరిచి నిద్రపోయేవారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది అలవాటు లేకుండా నోరు తెరిచి నిద్రపోతారు. నోరు తెరచి నిద్రపోవడానికి గల కారణాలను పరిశీలిస్తే.. జలుబు సమస్య ఉన్న వారు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. ఎందుకంటే ముక్కుద్వారా శ్వాస తీసుకోవడం సమస్యగా ఉండటంతో నోటి ద్వారా శ్వాసను తీసుకుంటారు.

నోరు తెరచి నిద్రించడం వల్ల దంత సమస్యలు, కావిటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదంతో పాటు నోటి లోపల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు,నోటి దుర్వాసన, పెదవులు పగలడం, గొంతు నొప్పి, నోరు బొంగురుపోవడం, దీర్ఘకాలిక అలసట, ముక్కు కారటం,గురక ఎక్కువగా ఉంచే అవకాశం ఉంది. ప్రతిరోజు బార్లీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

ముఖ్యంగా పిల్లలు నోటి శ్వాస తీసుకోవడం వల్ల దంతాలు వంకర పోతాయి. ఈ సమస్యకు ఆధునిక వైద్య విధానంలో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

సీపీఏపీ యంత్రాలు,మౌత్ ట్యాపింగ్ ,ఆర్థోడాంటిక్స్,మైయోఫంక్షనల్ థెరపీ వంటి చికిత్సలు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఒకవేళ మీకు ఈ సమస్య ఉంటే తప్పకుండా డాక్టర్లను సంప్రదించి ఈ ప్రాబ్లమ్ నుండి బయటపడండి.