barley water

బార్లీలో గింజలలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి, తక్షణ శక్తిని అందించడానికి ఈ బార్లీ సహకరిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బార్లీలో నీరు ఉపయోగాలు

బార్లీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండటం ద్వారా ఇది మలబద్ధకం సమస్య నుంచి బయటపడేస్తుంది. అంతేకాకుండా చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్స్ తో, కడుపుబ్బరం వంటి సమస్యతో బాధపడతారు. అటువంటివారు ఈ బార్లీ గింజలను నీరుని తీసుకుంటే మీకు ఈ సమస్యలని తగ్గిపోతాయి.ఇందులో విటమిన్స్ మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. వీటి ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన మలినాలను తగ్గించడంలో ఈ బార్లీ నీరు చాలా బాగా సహకరిస్తుంది.

చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతుంటారు. అటువంటివారు ప్రతిరోజు ఈ బార్లీ నీళ్ళు తీసుకున్నట్లయితే మీకు కిడ్నీలో  రాళ్లు కరిగిపోయి మూత్రం ద్వారా బయటికి వస్తాయి. అంతేకాకుండా మూత్ర సంబంధ సమస్యలు ఇన్ఫెక్షన్ల బారి నుండి కూడా బయటపడేస్తుంది. బార్లీలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంది. గుండెపోటు సమస్య ఉన్నవారు కూడా ఈ బార్లీ నీరు తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా కరిగిపోయి హాట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా వాడుకుంటే మీ బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మీకు వేడి చేసినప్పుడు ఈ బార్లీ నీరు తీసుకుంటే మీ శరీర ఉష్ణోగ్రత తగ్గి మీకు తక్షణ శక్తిని ఇస్తుంది.

Health Tips: ఈ 7 కారకాలు క్యాన్సర్ లక్షణాలను పెంచుతాయి.

ఎలా వాడాలి

బార్లీ గింజలను దోరగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ పొడిని రెండు నుంచి మూడు గ్లాసుల నీటిలో రెండు స్పూన్ల ఈ పొడి వేసుకొని కాసేపు మరిగించుకుంటే అది గంజిలాగా వస్తుంది. దీన్ని ప్రతి రోజు తీసుకుంటే మీకు తక్షణ శక్తితో పాటు వివిధ రకాలైన ఇన్ఫెక్షన్ల నుండి కూడా బయటపడవేస్తుంది. అధిక జ్వరంతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.