Mineral water (Photo credits: Flickr)

ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉంచిన నీటిని అందరూ తాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. బయటికి వెళ్తే దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్న నీటిని కొనుక్కుంటారు. ఇక ఇంట్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన ప్లాస్టిక్ బాటిల్స్ లో (plastic bottles and containers) నీరు నిల్వ ఉంచి తాగుతూ ఉంటారు. అయితే ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ లో (using plastic bottles) నీరు నిల్వ ఉంచి తాగడం ఏమాత్రం మంచిది కాదు అని అటు నిపుణులు సూచిస్తూ ఉంటారు. కానీ జనాలు మాత్రం పట్టించుకోకుండా ఇలాగే చేయడం చేస్తూ ఉంటారు. ఇంతకీ ప్లాస్టిక్ బాటిల్స్ లో (plastic bottles) నీళ్లు తాగితే ఏం జరుగుతుంది.. ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉందా అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నీళ్లు ఉన్న ప్లాస్టిక్ బాటిల్ లను ఎక్కువకాలం ఎండలో ఉంచితే దయాక్సిన్ అనే విష వాయువు వెలువడి ఇక నీళ్లలో కలిసి పోతుందట. ఇక ఇలాంటి నీళ్లను తాగితే రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ఎక్కువ కాలం ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ ఉన్న నీరు తాగడం కూడా ఎంతో ప్రమాదకరం అంటూ చెబుతున్నారు. ఇలా ఎక్కువ కాలం ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ ఉంచిన నీరు తాగితే బైఫినైనల్ అనే విషయం రసాయన శరీరంలోకి చేరి మధుమేహం ఊబకాయం సంతానోత్పత్తి సమస్యలు కాలేయ సమస్యలు పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గించటం లాంటివాటికి కారణమవుతోందని అంటున్నారు.

బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే ఆరు అద్భుతమైన ఆహారాలు ఇవే! ఈ ఫుడ్స్ తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ మీ కంట్రోల్‌లోనే ఉంటాయ్..

చాలారోజుల‌పాటు మండే ఎండ‌లో ఉంచిన ప్లాసిక్ బాటిళ్లు, క్యాన్ల‌లో వేడికి ప్లాస్టిక్ క‌ణాలు నీటిలో క‌లిసిపోతాయ‌ని తాజా అధ్య‌య‌నంలో ప‌రిశోధ‌కులు తేల్చారు. ఈ అధ్య‌య‌న ఫ‌లితాలు నవభారత్ టైమ్స్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. వాట‌ర్ ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్ల‌ను ఎండ‌లో ఉంచిన‌ప్పుడు వేడికి కొద్దిపాటి రసాయనాలు విడుద‌ల‌వుతాయ‌ని పరిశోధ‌కులు గుర్తించారు. ఉష్ణోగ్రత, సమయం పెరిగేకొద్దీ ప్లాస్టిక్‌లోని రసాయన బంధాలు ఎక్కువగా విచ్ఛిన్నమ‌వుతాయ‌ని, రసాయనాలు లీక్‌ అయ్యే అవకాశ‌ముంద‌ని తేల్చారు.

Salads for Weight Loss:సలాడ్స్‌లో ఇవి తింటున్నారా? అయితే అస్సలు బరువు తగ్గరు, సలాడ్స్ విషయంలో చాలా మంది చేస్తున్న తప్పులు ఇవే, ఈజీగా బరువు తగ్గేందుకు ఇలా తినండి

ఎక్కువ‌సేపు ఎండ‌లో ఉంచిన ప్లాస్టిక్ బాటిళ్ల‌లో నీళ్లు తాగితే మైక్రోప్లాస్టిక్ క‌ణాలు శ‌రీరంలో చేరి క‌డుపు సంబంధిత వ్యాధుల బారిన‌ప‌డ‌తార‌ని డాక్ట‌ర్ సందీప్ గులాటీ తెలిపారు. ఇది పీసీఓఎస్‌, అండాశయ సమస్యలు, రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ అనేక ఇతర వ్యాధుల‌కు కార‌ణ‌మయ్యే హార్మోన్ల అసమతుల్యతకు కూడా దారితీస్తుందని వెల్ల‌డించారు. దీర్ఘ‌కాలికంగా ప్లాస్టిక్ బాటిళ్ల‌లో నీటిని తాగితే ‘బైఫినైన‌ల్ ఏ’ అనే విష ర‌సాయ‌నం శ‌రీరంలో ఉత్ప‌త్తి అవుతుంది. ఇది ఈస్ట్రోజెన్-అనుకరించే రసాయనం. ఇది మధుమేహం, ఊబకాయం, సంతానోత్పత్తి సమస్యలు, ప్రవర్తనా సమస్యలు, బాలికల్లో యుక్తవయస్సు ప్రారంభంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని నిల్వ చేసి తాగకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.