చాలా మంది భోజనం చేసిన తర్వాత కొంచెం సోంపు గింజలు తినే అలవాటు ఉంటుంది. అలాగే కొన్ని హోటల్స్ లోనూ, రెస్టారెంట్లలోనూ భోజనం చివర్లో సోంపు ఇస్తుంటారు. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు వెళ్లినప్పుడు.. రకాల ఆహారపదార్థాలతో పాటు సోంపూ ఇస్తుంటారు .
అలా ఎందుకు ఇస్తారంటే.. సోంపు నోటిని శుభ్రం చేస్తుంది. ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి కూడా సహాయపడుతుంది. రోజు మధ్యాహ్నం, రాత్రికి భోజనం చేసిన తర్వాత కొన్ని సోంపు గింజలను నోట్లో వేసుకొని బాగా నమిలి మింగాలి. ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తుంటే జీర్ణసమస్యల నుంచి ఉపశమనం కలుగుతోంది. ముఖ్యంగా కడుపులో మంట సమస్యను తగ్గిస్తుంది