వర్షాకాలంలో వేడివేడిగా అల్లం టీ తాగాలని అందరికీ ఉంటుంది. అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా దీని రుచి చాలా బాగుంటుంది. అయితే ఎక్కువగా అల్లం టీ ని తాగడం ద్వారా మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎక్కువగా అల్లం టీ ని ఉపయోగించినట్లయితే ఆరోగ్యం పైన చెడు ప్రభావాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లం టీ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్ ట్రబుల్: అల్లం టీ ని అధికంగా తీసుకోవడం ద్వారా గ్యాస్ ఎసిడిటీ కడుపులో సమస్యలు వస్తాయి. అల్లం లో ఎసిడిక్ స్థాయిని పెంచే గుణాలు ఉన్నాయి. ఇప్పటికే గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు ఈ అల్లం టీ ని చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. లేకపోతే కడుపు సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రక్తాన్ని పలుచగా చేస్తుంది: అల్లం నేచురల్ బ్లడ్ తిన్నారుగా పనిచేస్తుంది. ఇది రక్తాన్ని పల్చడం చేయడానికి సహాయపడుతుంది. ఇప్పటికే మీరు కొలెస్ట్రాల్ మందులు రక్తం పలుచగా చేసే మందులు వేసుకున్న వేసుకునేవారు. అల్లం టీ ని తీసుకోవడం అంత మంచిది కాదు. దీని వల్ల మీరు ఇంకా రక్తం పల్చనాయి సమస్య తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..
లో బిపి: అల్లం లో రక్తపోటు తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. రక్తపోటు తక్కువగా ఉన్నవారు రక్త పోటు మందులు తీసుకునేవారు అల్లం టీ ని అధికంగా తీసుకోవడం ద్వారా మీకు ఇంకా మరింతగా బీపీ తగ్గి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది.
గర్భిణీలు వాడకూడదు: గర్భిణీలు అల్లం టీ ని ఎక్కువగా తీసుకోకూడదు. ఇది వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి బిడ్డకు హాని కలుగుతుంది దీన్ని తీసుకోకూడదు.
అలర్జీ: కొంతమందికి అల్లం వల్ల ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అల్లం టీ ను అధికంగా తీసుకోవడం ద్వారా చర్మం పైన వాపు, దద్దుర్లు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. మీది కనక ఎలర్జీటిక్ ఉన్న సమస్య ఉన్న చర్మం అయితే మీరు దీన్ని తీసుకోవడం మానివేయాలి.
ప్రతిరోజు ఒకటి రెండు కప్పుల అల్లం టీ ని వాడుకుంటే ప్రయోజనం. అంతేకాకుండా ఎక్కువగా తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి