Bacteria | Image used for representational purpose (Photo Credits: Pixabay)

హిమోగ్లోబిన్ మన శరీరానికి చాలా అవసరం. రక్తం తక్కువగా ఉండటం వల్ల మన శరీర భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దానివల్ల నీరసంగా అనిపిస్తుంది .రక్తం తక్కువగా ఉండటం వల్ల చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా స్త్రీలలో 11 నుంచి 13 గ్రాముల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉండాలి. అదేవిధంగా పురుషుల్లో 14 నుంచి 16 వరకు ఉండాలి. ఈరోజుల్లో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య లక్షణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రక్తహీనత లక్షణాలు

ఏ పని చేసిన చాలా అలసటగా నీరసంగా బలహీనంగా అనిపిస్తుంది. చర్మం తెల్లగా మారుతుంది. చర్మం పొడి బారుతుంది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు త్వరగా మారదు. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. తరచుగా తలనొప్పి వస్తుంది, నాలుక పైన పొక్కులు ఏర్పడతాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉంటాయి, కాళ్లు చేతులు తిమ్మిరిగా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోతుంటారు, ఈ లక్షణాలు మీరు గుర్తించినట్లయితే ఖచ్చితంగా మీలో రక్తహీనత సమస్య ఉంది. చాలామంది రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఐరన్ మాత్రమే యూస్ చేస్తూ ఉంటారు. వీటివల్ల కొద్దిరోజులు మాత్రమే పరిష్కారం లభిస్తుంది. కాబట్టి సహజ పద్ధతుల్లో మనము కొన్ని పండ్ల ద్వారా మన శరీరం రక్తాన్ని తయారు చేసుకుంటుంది. ఆ పండ్లను తీసుకున్నట్లయితే మీ శరీరంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది.

దానిమ్మ : దానిమ్మ పండు రక్తాన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ అనేవి చాలా ఉంటాయి. ఇది శరీరంలో మన రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక దానిమ్మ పండును తీసుకున్నట్లయితే మీ శరీరంలో రక్తాన్ని పెంచుకోవచ్చు.

ఆపిల్:  ఆపిల్ కూడా రక్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఆపిల్ తీసుకోవడం వల్ల మీ శరీరంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. ప్రతిరోజు ఒక ఆపిల్ ని తొక్కతో పాటు తీసుకోండి. ఇలా తీసుకున్నట్లయితే మీ హిమోగ్లోబిన్ స్థాయి అనేది పెరుగుతుంది.

నారింజపండు: సిట్రస్ ఫ్రూట్స్ లో కూడా హిమోగ్లోబిన్ పెంచేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకున్నట్లయితే మీ శరీరంలో రక్తహీనత అనే సమస్య నుండి దూరం అవ్వచ్చు. ప్రతిరోజు  నారింజ పండు తీసుకున్నట్లయితే మీ శరీరంలో హిమగ్లోబిన్ పర్సంటేజ్ అనేది చాలా తొందరగా పెరుగుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.