Brain (Credits: X)

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సరైన ఆహారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మెదడు పనితీరుకు జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు మనము రెగ్యులర్గా గనక తీసుకున్నట్లయితే మన ఆరోగ్యంతో పాటు మన మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో పోషకాలు ఉన్న సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

వాల్ నట్స్: వాల్నట్స్ లో జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది మన శరీర ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  మన మెదడు సామర్థ్యాన్ని మన జ్ఞాపక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ వల్ల మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా పెరుగుతాయి. ఇది మన మెదడు ఆరోగ్యంగా ఉండడంలో ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజు కూడా మీరు ,పిల్లలకు వాల్నట్ను ఆహార భాగంగా ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే మెదడు పనితీరు మెరుగు పడుతుంది.

బాదం: బాదం లో కూడా అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ ఇ ,క్యాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి గుణాలు అధికంగా ఉంటాయి. ఇది మెదడుకు తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. చాలామంది మానసిక ఒత్తిడి తోటి బాధపడుతున్నవారు రెగ్యులర్గా గనక బాదంపప్పులు మీ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఇది మెదడు ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ గా పని చేస్తుంది. ఇందులో ఉన్న విటమిన్  ఇ కి మెదడుకు శక్తిని అందించడంలో అదేవిధంగా మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్సు పుష్కలంగా ఉండడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా బాదాం ని మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మెదడు శక్తి పెంచడంతోపాటు ఒత్తిడిని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

Health Tips: గర్భవతులు తేనెలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో ...తెలుసా..

ఫుల్ మఖాన: ఫుల్ మఖానాలో ప్రోటీన్స్, మినరల్స్ ,ఫైబరు ,విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మనం మెదడుకు శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ఉన్న ఫైబరు, ప్రోటీన్, మినరల్స్ ఇవి మూడు కూడా మనిషి మెదడు శక్తిని పెంచడంకి అదే విధంగా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇందులో ఉన్న ప్రోటీన్స్ శక్తిని అందిస్తాయి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. మీరు ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మెదడు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.