గుండె మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. నిరంతరం అది కొట్టుకోవడం ద్వారా మనకు జీవితాన్ని ఇస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల నుండి తక్కువ వయసు ఉన్న వారిలో కూడా గుండెపోటు, గుండె సంబంధ వ్యాధులు ఎక్కువైంది. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ళ వయసు వారు ఎక్కువగా ఈ గుండె జబ్బులతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే జీవనశైలిలో మార్పులు తీసుకునే ఆహారంలో మార్పు ఒత్తిడి వంటి కారణాలు ఎక్కువగా గుండె ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే కొన్ని అలవాట్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన జీవనశైలి- ఈ మధ్యకాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణాలు చూసుకున్నట్లయితే పని ఒత్తిడి పనుల వల్ల రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవడం తెల్లవారుజామున త్వరగా లేవడం ఫాస్ట్ ఫుడ్ తినడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరానికి తగినంత విశ్రాంతి లభించక ఉబకాయం, రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. సమయానికి నిద్రపోకపోవడం వల్ల మన శరీరంలో జీవ క్రియలు అన్నీ కూడా ఇబ్బందికి గురి అవుతాయి .అటువంటి అప్పుడు ఆరోగ్యకరమైన జీవన శైలిలో మనం బ్రతకాలి తగినంత విశ్రాంతి, వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం ,వంటివి తీసుకున్నట్లయితే మన గుండె ఆరోగ్యం బాగుంటుంది.
Health Tips: తరచుగా తలనొప్పి వస్తుందా ,అయితే తలనొప్పికి ఈ కారణాలు ...
ఆహారం- మన గుండె ఎల్లప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి మనం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. విటమిన్లు, మినరల్స్, ఫైబర్ , పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ,ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్టైల్ తగ్గుతాయి. దీని ద్వారా గుండె ఆరోగ్యానికి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.
వ్యాయామం- గుండా ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా రోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ముఖ్యం. దీనివల్ల గుండె కండరాలు బలపడతాయి. శరీరానికి రక్తప్రసరణ అందుతుంది. వాకింగ్ ,జాగింగ్, సైక్లింగ్ వంటివి గుండె సామర్థ్యాన్ని పెంచుతాయి. వ్యాయామం వల్ల శరీరంలో క్యాలరీలు కూడా బర్న్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఒత్తిడి- ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఒత్తిడి కారణంగా మన శరీరంలో పార్టిసాలు అనే హార్మోను పెరుగుతుంది. ఇది రక్తపోటును హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికోసం యోగ ధ్యానం వంటివి చేయడం ఉత్తమం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి