foods

జింక్ మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన మినరల్. ఇది గాయాలు నయం చేయడంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జింక్ లోపం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనపడటం, ఎదుగుదల లేకపోవడం, గాయాలు నెమ్మదిగా నయం అవ్వడం ,ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు పిల్లలకు వృద్ధులకు జింక్ లోపం చాలా ఇబ్బందులను కలిగే చేస్తుంది. జింక్ లోపం ఉన్నప్పుడు తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. సీజనల్ వ్యాధుల్లో కూడా జలుబు జ్వరం ఫ్లూ వంటి వ్యాధుల్లో కూడా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. జింక్ లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గాయాలు త్వరగా మానవు: మీలో జింక్ లోపం ఉన్నట్లయితే మీకు చిన్న గాయాలైన అవి మానడానికి ఎక్కువ సమయం పడుతుంది.. జింక్ మన శరీరంలో కొత్త కణాలను ఏర్పాటు చేయడానికి సహాయపడుతుంది జింక్ లోపం ఉన్నప్పుడు ఈ కణజాల ఉత్పత్తికి చాలా మందకోడిగా సాగుతుంది. దీనివల్ల గాయం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా దీని ద్వారా ఆ గాయం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పిల్లల ఎదుగుదలకు లోపం: జింక్ లోపం వల్ల ముఖ్యంగా పిల్లలలో శారీరక మానసిక అభివృద్ధి అనేది ఉండదు. జింక్ లోపం వల్ల పిల్లలలో ఎదుగుదల ఉండదు. వారి ఎత్తు బరువు సాధారణ పిల్లలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. జింక్ లోపం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి వాళ్ళ జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.

ఇతర లక్షణాలు: జింక్ లోపం వల్ల నీరసం, నిస్సత్తువ, ఆకలి లేకపోవడం, జుట్టు రాలడం, చర్మం పైన దద్దుర్లు రావడం, ఆహారం రుచిగా లేకపోవడం, వాసనల సమస్య వంటివి ఎదుర్కొన్నట్లయితే మీలో జింక్ లోపం ఉన్నట్లే.

Health Tips: కండరాల నొప్పులతో బాధపడుతున్నారా.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి: జింక్ లోపాన్ని అధిగమించడం కోసం మన ఆహారంలో అధికంగా జింకు ఉండే మాంసం, చేపలు, పప్పులు, నట్స్, పాల ఉత్పత్తులు తీసుకున్నట్లయితే మీకు జింక్ లోపం సమస్య నుండి బయటపడతారు.

అంటే కాకుండా మీరు ఆకుపచ్చని కూరలు పండ్లు తృణధాన్యాలు వంటివి తీసుకున్నట్లయితే ఇది మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటితోపాటు మన శరీరంలో ఐరన్ క్యాల్షియం ఇతర ఖనిజాలను కూడా పెంచడానికి ఈ ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి.

సప్లిమెంట్స్: ఒకవేళ మీరు తీవ్ర జింక్ లోపంతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ సలహా పైన జింక్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.