పిల్లలకు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం ఇష్టంగా ఉంటుంది .ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లలకు వారి సంతోషాన్ని కోసం పిజ్జా, బర్గర్, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, వంటి జంక్ ఫుడ్ ను బయటకు వెళ్ళినప్పుడల్లా ఇస్తూ ఉంటారు. అయితే ఇవి పిల్లల ఆరోగ్యానికి మేలు చేయదు.అనేక రకాలైనటువంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది .ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది.
సోడియం అధికంగా ఉంటుంది
పిజ్జా, బర్గర్లో సోడియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో త్వరగా రక్తపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇది మన శరీరంలోని క్యాల్షియం గ్రహించి ఎముకలను బలహీన పరుస్తుంది. దీని ద్వారా పిల్లలలో ఎదుగుదల లోపం ఉంటుంది. అధిక సోడియం వల్ల పిల్లలకు ఇది చాలా అనారోగ్యకరం.
క్యాన్సర్ కారకం.
ఇందులో అక్రిలమైడ్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి చిన్న పిల్లల ఆరోగ్యానికి చాలా హానికరం. ముఖ్యంగా పిజ్జా బర్గర్ బ్రెడ్ స్నాక్స్ కేక్ ఐటమ్స్ వంటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది కాన్సర్ కారకంగా పరిశోధనలో తేలింది. దీనిని రెగ్యులర్ గా గనక తీసుకున్నట్లయితే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది మీ పిల్లలకు ఇవ్వకుండా ఉండడమే మంచిది.
Health Tips: మెంతుల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...
గుండె సమస్యలు- పిజ్జా బర్గర్లలో అధిక శాతం కొవ్వులు ఉంటాయి. ఇది అధిక బరువు పెంచుతుంది. దీని ద్వారా గుండె జబ్బులు షుగర్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో చీజ్ సాస్వంటి పదార్థాలు కలుపుతారు. వీటిలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ క్యాలరీ తీసుకోవడం వల్ల వారి శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ గా మారి గుండె జబ్బులు రావడానికి కారణం అవుతుంది. కాబట్టి వీటిని తీసుకోకుండా ఉండడమే ఉత్తమం.
ఆరోగ్యమైన ఆహారం- పిల్లలకు బేకడ్ ఐటమ్స్ ,డీప్, ఫ్రై ఐటమ్స్ కంటే కూడా పోషకాహారాలు ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వడం చాలా ఉత్తమం. ఇంట్లోనే చేసేటువంటి కొన్ని చిరుతనులు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా పండ్లు, మొలకలు, డ్రైఫ్రూట్స్, వంటి వాటిని ఇస్తే పిల్లల ఎదుగుదలకి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.