చాలామంది ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతున్న సమస్య కడుపు ఉబ్బరం. మన జీవన శైలిలో మార్పులు ఆహార అలవాట్లలో మార్పులు దీని ద్వారా శరీరంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా మన కడుపులో ఉబ్బరంగా అనిపించడం చాలా ఇబ్బందిని కలిగించే విషయం. దీని గురించి దీనికి కారణాలు వీటిని చికిత్స ద్వారా ఎలా తగ్గించుకోవాలి. ఈరోజు తెలుసుకుందాం.
కడుపు ఉబ్బరం అంటే ఏమిటి.
సాధారణంగా కడుపుబ్బరం అనే సమస్య గ్యాస్ తో మన పొట్ట ఉబ్బి పోయినట్లుగా కనిపించేటటువంటి పరిస్థితి. ఇది తరచుగా తినడం ద్వారా, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకునేటప్పుడు, జంక్ ఫుడ్ అధికంగా తీసుకున్నప్పుడు, ఎక్కువ భోజనం చేసేటప్పుడు ఈ సమస్య మనకు కలుగుతుంది. దీని ద్వారా కడుపు నొప్పి, త్రేనుపులు రావడం, గ్యాస్ కొన్నిసార్లు వాంతులు, విరోచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి.
కారణాలు: కడుపు పురం రావడానికి అనేక రకాలైనటువంటి కారణాలు కలిగి ఉంటాయి వ్యవస్థలో సమస్యలు లాక్టోజ్ ఎంటోలోరెన్స్ ఐబీఎస్ హార్మోన్ల మార్పుల కారణంగా ఈ కడుపుబ్బరం వస్తుంది. అయితే ఈ సమస్య సాధారణమైనప్పటికీ కొన్నిసార్లు తీవ్రమైనదిగా మారుతుంది. ఇది నిరంతరం అలాగే ఉంటే లోపల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు పెరుగుతాయి.
Health Tips: షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారా
అధిక బరువు: మన శరీరంలో అధిక కొవ్వు ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అధిక బరువు పెరగడం ద్వారా మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఈ కడుపుబ్బరం సమస్య ఏర్పడుతుంది. అధిక బరువు వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి అలసట కీళ్ల నొప్పులు, అనేక రకాలైన జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అధిక బరువు వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. గుండె జబ్బులు బిపి క్యాన్సర్ ఆస్టియో ఆర్థరైటిస్ వంటి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చికిత్స: కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా మనం చేయవలసిన పని బరువు తగ్గించుకోవడం బరువు తగ్గడం ద్వారా ఈ సమస్య నుంచి కొంచెం ఉపశమనాన్ని పొందవచ్చు. అంతే కాకుండా ప్రతిరోజు వ్యాయామం, ధ్యానం, మెడిటేషన్ వంటివి చేసి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతాము. శరీరానికి తగినంత నీరు ఎప్పుడూ ఉండాలి రోజు కనీసం రెండు లీటర్ల నీటిని తాగితే ఈ కడుపుబ్బరం సమస్య తగ్గిపోతుంది.ఆయిల్ ఫుడ్స్ పిజ్జా బర్గర్ వంటి జంక్ ఫుడ్ లకు దూరంగా ఉంటే ఈ కడుపుబ్బరం సమస్య తగ్గుతుంది. మద్యపానం, ధూమపానం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి వీటిని సాధ్యమైనంతవరకు తక్కువగా తీసుకుంటే ఉత్తమం. మాంసాహారాన్ని కూడా కడుపుబ్బరం సమస్యను తీవ్రతరం చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సలాడ్స్ తాజా పండ్లు తీసుకోవడం అంటే ఉత్తమం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.