ఈ మధ్యకాలంలో చాలామంది కంటికింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇది ఆరోగ్యానికి సంబంధించిన అయినప్పటికీ కూడా కొంతమంది తమ అందాన్ని కూడా తగ్గిస్తాయని బాధపడుతూ ఉంటారు. అయితే కళ్ళ కింద నల్లటి వలయాలు రావడానికి నిద్రలేమి, ఒత్తిడి, డిప్రెషన్ వల్ల అని అనుకుంటారు. అయితే అవి మాత్రమే కాకుండా కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల కూడా ఈ కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్, రక్తహీనత, విటమిన్ లోపం, చర్మవ్యాధులు, డిహైడ్రేషన్ వంటి సమస్యలతో ఈ కళ్ళకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. అయితే దీనికి కారణాలు చికిత్స తెలుసుకుందాం.
కారణాలు- కళ్ళ కింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు రాత్రి సరిగా నిద్ర లేకపోవడం, రక్తహీనత సమస్య ,కళ్ళ చుట్టూ ఎలర్జీ ,కళ్ల కింద ఉన్న చర్మం వదులుగా అవ్వడం, ఎక్కువసేపు టీవీ చూడడం, చదవడం,, ఫోన్ చూడడం కంప్యూటర్లను అతిగా ఉపయోగించడం, ధూమపానం, మద్యపానం, ఎక్కువగా సేపు ఎండలో వ్యాయామం చేయడం వంటివి ఈ కళ్ళ కింద నల్లటి వలయాలు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు.
Health Tips: మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా
తీసుకోవలసిన జాగ్రత్తలు- కళ్ళ కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడేవారు చాలామంది మార్కెట్లో వచ్చే రకరకాల అయినటువంటి క్రీములు లోషన్లు వాడుతూ ఉంటారు. అయితే ఇవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మీరు మానసిక ఒత్తిడికి, ఆందోళనలకు దూరంగా ఉండటం ద్వారా కళ్ళకింద వలయాలు తగ్గిపోతాయి. కళ్ళను ఎక్కువగా రుద్దకండి ఎక్కువసేపు ఫోన్ టీవీ చూడకుండా కండ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. మీరు బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు కంటికి కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోకండి, కీరా ముక్కలను కళ్ళ పైన పెట్టుకుంటే ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా బంగాళాదుంప పేస్టును కూడా నల్లటి వలయాలు ఉన్న దగ్గర అప్లై చేసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి