బిజీ లైఫ్ వల్ల చాలామంది అధిక బరువుకు గురవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినడం, తక్కువ వ్యాయామం చేయడం ,జీవనశైలిలో మార్పు, స్ట్రెస్, నిద్రలేకపోవడం వంటి వాటి వల్ల కూడా ఉబకాయం వస్తుంది. దీని ద్వారా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. అయితే కొన్ని ఆహార పదార్థాలను మనం ప్రతిరోజు తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ముఖ్యంగా జీరో క్యాలరీ ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. ఆహార పదార్థాలలో ఫైబరు నీరు విటమిన్లు మినరల్స్ ను కలిగి ఉంటుంది. జీరో క్యాలరీ ఉన్న ఫుడ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దోసకాయ- దోసకాయలో సుమారు 95% నీరు ఉంటుంది. ఇది జీరో క్యాలరీల ఆహారంగా చెప్పవచ్చు. ఇది మన శరీరానికి తేమను అందించడానికి సహాయపడుతుంది. దీన్ని సలాడ్ రూపంలో తీసుకున్నట్లయితే మీకు బరువు తగ్గుతారు. అంతే కాకుండా ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడం ద్వారా జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీకు త్వరగా ఆకలి అనిపించదు. దీని వల్ల మీరు బరువు తగ్గుతారు.
Health Tips: కరివేపాకులో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తేలుసా ...
ఆకుకూరలు- మెంతుకూర ఆ బచ్చలి కూర పాలకూర వంటి వాటిల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయల్లో విటమిన్ సి కె ఐరన్ క్యాల్షియం ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తం ఏర్పడడానికి మన శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. షుగర్ లెవెల్ ను కంట్రోల్లో చేస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిలో కేలరీలు తక్కువగా ఉండడం ద్వారా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
నిమ్మకాయ- నిమ్మకాయలో కేవలం విటమిన్ సి మాత్రమే కాకుండా క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఇందులో కేవలం 20 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి గొప్ప మార్గంగా చెప్పవచ్చు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మన చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నిమ్మ రసాన్ని కలిపిన నీరును ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మన శరీరం హైడ్రేటుగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. కాలేయ సమస్యలు తగ్గిపోతాయి బరువు కూడా తగ్గిపోతారు.
జీరో క్యాలరీ ఫుడ్స్ ప్రయోజనాలు- మీరు తీసుకునే ఆహారంలో జీరో క్యాలరీ ఫుడ్ ను చేర్చుకోవడం ద్వారా మీ క్యాలరీలు తగ్గుతాయి. దీని ద్వారా బరువు పెరిగే ప్రక్రియ సులభం అవుతుంది. ఇవి మన శరీరానికి కావాల్సినంత పోషకాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీరో క్యాలరీ ఫుడ్ లో ఎక్కువ శాతం వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి