ఈ మధ్యకాలంలో గుండె జబ్బుల సంఖ్య అత్యధికంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం పెద్దవారు మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు యువతలో కూడా గుండె సంబంధం సమస్యలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీవనశైలిలో మార్పు గుండెల్లో బ్లాకులు అధిక బరువు అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బీపీ సమస్యల వల్ల కూడా గుండె జబ్బులు ప్రారంభమవుతున్నాయి. అయితే మనము కొన్ని ఆయుర్వేదంలో ఉన్న ఔషధాలను ఉపయోగించి గుండెను ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందులో అర్జున బెరడు ఒకటి గుండె జబ్బులన తగ్గించడానికి అర్జున బెరడు ఒక అద్భుత ఔషధంగా వాడుతారు. అంతేకాకుండా అనేక రకాల జబ్బులు తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. అర్జునుడును కషాయం రూపంలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె కండరాలను బలంగా ఉంచుతుంది..
అర్జున బెరడులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే దీన్ని తీసుకోవడం ద్వారా గుండె కండరాలు బలంగా మారుతాయి. దీనివల్ల గుండెకు మేలు జరుగుతుంది.
బిపి కంట్రోల్ లో ఉంటుంది- అర్జున బెరడులో టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, కొమరిన్ వంటి మూలకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బీపీని నియంత్రణలో ఉంచుతాయి. బిపి తగ్గడం ద్వారా గుండెకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని ప్రతి రోజు కషాయం రూపంలో తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
Health Tips: ఖాళీ కడుపుతో లీచీ తింటే ప్రాణాపాయం..
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది- అర్జున బెరడు కషాయాన్ని ప్రతిరోజు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో గడ్డ రక్తం గడ్డలు కట్టకుండా చేస్తుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టే సమస్య ఉండదు. కాబట్టి గుండె సమస్యలు ఏవి రాకుండా ఉంచుతుంది.
ఆందోళన తగ్గుతుంది- ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ప్రజల్లో తీవ్రమైన ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అర్జునుడు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా వీరికి మానసిక ఆందోళన తొలగిపోయి ఉపశమనం లభిస్తుంది.
ఎలా తయారు చేసుకోవాలి- అర్జున్ బెరడు కషాయాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అర్జున్ బెరడును అన్ని ఆయుర్వేదం షాపులలో లభిస్తుంది. అర్జున బెరడు మొక్కను తీసుకొని దాన్ని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పొడిని అర టీ స్పూను అర టీ స్పూన్ దాల్చిన చెక్క అరకప్పు నీళ్లలో కలిపి సగం వరకు అయ్యే వరకు మరిగించాలి. దీని ఫిల్టర్ చేసి చల్లారిన తర్వాత తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి