Health Tips: ఈ మధ్యకాలంలో తరచుగా చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి పోషకాహార లోపం శ్రమ లేకపోవడం అధిక బరువు, జెనిటిక్ వల్ల కూడా ఈ షుగర్ సమస్య రోజురోజుకే పెరుగుతుంది. ఇప్పుడు చిన్న వయసులో వారికి కూడా ఈ షుగర్ సమస్య మరింతగా ఇబ్బంది పెడుతుంది. అయితే టాబ్లెట్స్ వాడినప్పటికీ కూడా దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే ఆయుర్వేదంలో దీనికి ఒక చక్కటి పరిష్కారం ఉంది. అధిక షుగర్ తో బాధపడేవారు చేదు జీలకర్రను ఈ విధంగా వాడితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
Health Tips: మండి ఆహారం తింటున్నారా దీని వల్ల కలిగే నష్టాలు
చేదు జిలకర- అన్ని మార్కెట్లలో లభిస్తుంది ముఖ్యంగా ఆయుర్వేదం షాప్స్లలో లభిస్తుంది. ఇది చూడడానికి జీలకర్ర లాగా ఉన్నప్పటికీ కాస్త నలుపు రంగులో ఉండడం వల్ల దీనికి నల్ల జీలకర్ర అనే పేరు ఉంటుంది. అయితే ఇది చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి దీనికి చేదు జీలకర్ర అనే పేరు కూడా ఉంటుంది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అనేక రకాల జబ్బులను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్- చేదు జిలకరలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాన్ని పెంచుతుంది. దీని ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
షుగర్ పేషెంట్స్ కి- ఇది చేదుగా ఉండడం ద్వారా షుగర్ పేషెంట్స్ కి ఒక అద్భుత వర్మని చెప్పవచ్చు. దీన్ని 15 రోజులపాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీన్ని వాడినట్లయితే కచ్చితంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా బరువు తగ్గుతారు రక్తపోటు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా టైప్ టు డయాబెటిస్ కి ఇది చక్కటి వరంగా చెప్పవచ్చు.
ఎలా ఉపయోగించాలి- మార్కెట్లో ఉంటుంది దీన్ని తీసుకొని దోరగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఉదయం సాయంత్రం భోజనానికి ముందు రెండు గ్రాముల వరకు తీసుకొని వేడి నీటిలో కలుపుకొని తాగవచ్చు 15 రోజుల తర్వాత మీ షుగర్ లెవెల్స్ ని ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే కచ్చితంగా రిజల్ట్ ఉంటుంది.
దీన్ని ఇలా కాకుండా చిన్న చిన్న మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు. వీటిని కూడా ఉదయం టిఫిన్ కి ముందు రాత్రి భోజనానికి ముందు ఒక్కొక్క టాబ్లెట్ లాగా వేసుకున్నట్లయితే చక్కగా పనిచేస్తుంది.
Disclaimer:పైన పేర్కొన్న విషయం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీ ఆరోగ్య సమస్యల కోసం సమీపంలో సర్టిఫైడ్ మెడికల్ డాక్టర్లను సంప్రదించండి.