Lancet says one in eight people globally is now obese (Photo Credit: Pixabay)

ఈరోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. వంశపారంపరంగా వచ్చే కారణాలతో ఏర్పడతాయని ఇంతకుముందు అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సేపు కూర్చోవడం, శరీరానికి తగినంత శ్రమ ఇవ్వకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం థైరాయిడ్ సమస్య వల్ల ఏర్పడుతుంది. అంతేకాకుండా సరిగ్గా నిద్రపోకపోవడం, స్ట్రెస్, మందులు ఎక్కువగా వాడడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, ఇంకా కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ ఉబకాయం వస్తుంది.

ఈ 5 రకాల ఫుడ్స్ వల్ల మీరు అధిక బరువును తగ్గించుకోవచ్చు.

నిమ్మకాయ తేనె రసం: ఉదయం లేచిన వెంటనే కాఫీ టీలకు బదులుగా గోరువెచ్చటి నీటిలో నిమ్మకాయ తేనె కలుపుకొని తాగినట్లయితే మీరు బరువు తగ్గుతారు. అదే విధంగా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. తరచుగా వచ్చేటువంటి జబ్బులను రానీయకుండా చేస్తుంది.

చియా సీడ్స్: చియా సీడ్స్ కూడా మీరు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో మెగ్నీషియం మాంగనీస్ క్యాల్షియం అధికంగా ఉండడం వల్ల ఫైబర్ రిచ్ గా ఉంటుంది. దీంతో మీకు వీటిని తీసుకుంటే పొట్ట అనేది నిండుగా ఉండి చాలాసేపు వరకు ఆకలి వేయదు తద్వారా మీరు బరువు తగ్గుతారు.

దాల్చిన చెక్క కషాయం: దాల్చిన చెక్కను పొడి చేసుకొని మరిగే నీటిలో ఒక స్పూను దాల్చిన చెక్కను వేసుకొని అది చల్లారిన తర్వాత ప్రతిరోజు తాగినట్లయితే మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వును కరిగిస్తుంది. అంతేకాకుండా ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. శరీరంలో వచ్చేటువంటి అనేక రక క్యాన్సర్లను కూడా తగ్గించడానికి ఈ దాల్చిన చెక్క కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది.

డ్రై ఫ్రూట్స్: ఉదయం అల్పాహారానికి బదులుగా డ్రైఫ్రూట్స్ ను  మీరు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే బరువు తగ్గుతారు. ఇడ్లీ ,దోశ ఇటువంటి వాటిల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి మీ బరువు పెంచుతాయి. కాబట్టి వాటి బదులుగా మీరు నానబెట్టిన బాదం గింజలు వాల్నట్స్  లాంటివి తీసుకున్నట్లయితే మీ బరువు తగ్గుతారు.

వ్యాయామం: దీంతోపాటు ప్రతిరోజు 45 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. యోగ మెడిటేషన్ చేసినట్లయితే మీ శరీర బరువును పెరగకుండా అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గినట్లయితే మీకు గుండె సంబంధం సమస్యలు అజీర్ణ సమస్యలు ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గిపోయి మీ ఆయుష్షు అనేది పెరుగుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.