irregular periods

మహిళల శరీరంలో అనేక రకాలైన హార్మోన్ల మార్పులు కారణంగా PCOS, PCOD సమస్యలు వస్తాయి.  జీవనశైలిలో మార్పు, వారికి వచ్చే పిరియడ్స్  మార్పుల కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. కొంతమందిలో ఐదు నుండి ఏడు రోజుల వరకు వస్తాయి అయితే కొంతమందిలో కేవలం ఇవి ఒకటి రెండు రోజులు మాత్రమే రావడము  దీనిని PCOS లేదా PCOD అంటారు. అంటే పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ దీనివల్ల మన శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా బరువు పెరగడం తగ్గడం వంటి లక్షణాల్లో ఇది ఒకటి

PCOD  అంటే ఏంటి.

మహిళల్లో సహజంగా కనిపించే ఒక సమస్య. ప్రతి పదిమందిలో ఐదుగురు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది ఒక హార్మోన్ సంబంధిత సమస్య దీనివల్ల పీరియడ్స్ అనేవి లేట్  అవుతూ ఉంటాయి. స్త్రీల అండాశయంలో అసాధారణంగా ఆండ్రోజెన్ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఈ పీసీఓఎస్ సమస్య ఏర్పడుతుంది.

Health Tips: ఇర్ రెగ్యులర్ పిరియడ్స్ తో బాధపడుతున్నారా

లక్షణాలు: పి సి ఓ ఎస్ కు సంబంధించిన లక్షణాలు మనం గమనించినట్లయితే వీరిలో ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. అంతేకాకుండా సంతాన సమస్యలతో బాధపడతారు. ముఖ్యంగా మొహం పైన మొటిమలు, విపరీతంగా వస్తాయి. చర్మం పైన ఎప్పుడు కూడా జిడ్డు ఏర్పడుతుంది. అంతేకాకుండా మొహం పైన శరీరం పైన వెంట్రుకలు వస్తాయి.విపరీతంగా జుట్టు రాలిపోతుంది బరువు పెరుగుతారు. విపరీతంగా కొవ్వు పెరుగుతుంది ఇవన్నీ కూడా పీసీఓఎస్ లక్షణాలు.

చికిత్స: పి సి ఓ ఎస్ తో బాధపడే వారికి ప్రత్యేక మందులు అంటూ ఏమి ఉండవు. ముఖ్యంగా మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మంచి ఆహారం, వ్యాయామం, యోగా, ధ్యానం, ఆయిల్ ఫుడ్స్ ను తగ్గించడం టైం ప్రకారం తినడం సరైన నిద్ర, పాలు, పెరుగు, వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.