Health Tips: చలికాలం వచ్చిందంటే చాలు ముఖ్యంగా సైనస్ ఇబ్బంది ఉన్న వారిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ చలికాలం పోయే వరకు వీరికి అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టూమూడుతూ ఉంటాయి. అయితే సైనస్లు తగ్గించుకోవడం కోసం కొన్ని రకాలైన చిట్కాలు పాటించినట్లయితే ఈ సరైన సమస్య నుంచి బయటపడవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సైనసైటిస్ ను పెంచే కారణాలు.. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి జలుబు దగ్గు చలికాలం పోయేవరకు అస్సలు వదలదు ముఖ్యంగా వీరు చల్ల ప్రదేశాల్లో అసలు తిరగకూడదు. అటువంటి ప్రదేశంలో తిరిగినట్లైతే వీరికి ఈ సమస్య మరింతగా తీవ్రమవుతుంది. చల్లగాలికి మరియు అదే విధంగా కాలుష్యానికి దూరంగా ఉండాలి. కొంతమందిలో మనము పెంపుడు జంతువుల ద్వారా కూడా ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది.
లక్షణాలు.. ముఖ్యంగా ముఖం పైన ఎక్కువగా కనిపిస్తాయి. కంటి చుట్టూ ముక్కు చుట్టూ మొహంలో ఒక విధమైన తిమ్మిరిగా తల బరువుగా అనిపిస్తూ ఉంటుంది. జలుబు ఎక్కువగా ఉంటుంది. జలుబు తొందరగా తగ్గదు అంతేకాకుండా గొంతులో స్లేష్మము అధికంగా ఉంటుంది. గొంతు నొప్పి దగ్గు వంటి సమస్యలు కూడా చాలా తొందరగా తగ్గవు.
Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు..
సైనస్లు తగ్గించే మార్గాలు. చలి ప్రదేశాలకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఇంటిలో ఇమ్మీడి ఫైర్ ను వాడడం మంచిది. చల్లగాలులకు దుమ్ముకు దూలికి దూరంగా ఉంటే మంచిది. ఫ్లూ జలుబు వంటి లక్షణాలు ఉన్నవారికి కూడా దూరంగా ఉండాలి. వేడివేడి సూప్స్ లో తీసుకోవాలి. అంతేకాకుండా ఆవిరి పట్టడం వంటివి కూడా సైనా సమస్యను తగ్గిస్తాయి. ఎండలో ప్రతిరోజు ఉదయం ఒక 20 నిమిషాల పాటు కూర్చున్నట్లయితే కూడా ఈ సైనసైటి సమస్య కూడా తగ్గుతుంది. యోగ మెడిటేషన్ వంటివి కూడా ఈ సమస్యను తగ్గిస్తాయి.
Disclaimer:పైన పేర్కొన్న విషయం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీ ఆరోగ్య సమస్యల కోసం సమీపంలో సర్టిఫైడ్ మెడికల్ డాక్టర్లను సంప్రదించండి.