మహిళల్లో పీరియడ్స్ సమయంలో రాషెస్ రావడం అనేది తరచుగా వింటూ ఉంటాం. దీనివల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో తొడలు ముందు భాగంలో వెనక భాగంలో రాషెస్ అనేవి ఏర్పడతాయి. చర్మం పై దద్దుర్లు కనిపిస్తుంటాయి. ఇవి పీరియడ్స్ సమయంలో అసౌకర్యం కి గురిచేస్తాయి. ఈ రాషెస్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం.
రాపిడి: పీరియడ్స్ లో రాషెస్ రావడానికి ముఖ్య కారణం సానిటరీ పాడ్స్ ని యూస్ చేస్తున్నప్పుడు అవి కొంచెం రాపిడికి గురవుతాయి. దీని ద్వారా మనకు రాషెస్ వస్తాయి. పనిచేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఈ శానిటరీ పాడ్స్ గీరుకుపోయి మనకురాషెస్ అయ్యి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి.
తడిగా ఉండడం: పీరియడ్స్ వచ్చినన్ని రోజులు కూడా ఆ ఏరియా మొత్తం కూడా తడిగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ రాషెస్ రావడానికి కారణం అవుతాయి. కాబట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఫ్యాడ్స్ మార్చుకున్నట్లయితే దీని నుంచి బయటపడవచ్చు.
Health Tips: పచ్చి ఏలకులు వారం రోజుల పాటు నమిలితే ఏమవుతుందో తేలుసా ...
ఎలర్జీ: కొంతమందిలో ఈ శానిటరీ ఫ్యాడ్స్ బ్రాండ్స్ అనేవి పడవు దీనివల్ల వారికి రాషర్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి వారి చర్మానికి తగ్గట్టుగా వారికి సరిపోయేటువంటి సెంటరీ ప్యాడ్స్ ని యూస్ చేసినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
క్లీన్ గా ఉంచుకోవాలి: సమయంలో కొంతమంది శానిటరీ ప్యాడ్స్ మార్చుకోవడానికి సమయం కుదరదు. దీనివల్ల చాలాసేపు ఫ్యాడ్ ఉంచుకోవడం వల్ల ఆ ఏరియా అంతా కూడా అపరిశుభ్రంగా అవుతుంది. దీని ద్వారా కూడా రాషస్ అవుతాయి కాబట్టి తరచుగా వాష్ చేసుకుంటూ సానిటరీ పాడ్స్ ను ప్రతి రెండు గంటలకు ఒకసారి మార్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాక దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తరచుగా పాన్ మార్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఈ రాషెస్ రాకుండా ఉండడానికి మార్కెట్లో అనేక రకాలైన క్రీమ్స్ లభిస్తున్నాయి. ఆంటీ రాషెస్ ఇవి యూస్ చేస్తే ఫలితం ఉంటుంది అంతేకాకుండా మన ఇళ్లల్లో దొరికే కొబ్బరి నూనెను ,అలోవెరా జెల్ ని కూడా రాషెస్ ప్రదేశంలో రాసినట్లయితే ఇవి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా రాషెస్ వచ్చిన దగ్గర బేబీ పౌడర్ యూస్ చేసినట్లయితే మీరు రాషెస్ తొందరగా తగ్గిపోతాయి. తరచుగా శానిటరీ పాడ్స్ మార్చుకుంటూ పరిశుభ్రంగా ఉంచడం ఉంచుకోవడం వల్ల కూడా ఈ ర్యాషెస్ రాకుండా ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.