grey hair ( Image: File)

ఈ మధ్యకాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు కూడా అందరూ తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య యువతను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఒకప్పుడు ఈ సమస్య కేవలం 60 ఏళ్ల వాళ్లలో మాత్రమే కనిపించేది. కానీ దీనివల్ల ఇప్పుడు అదొక తీవ్ర సమస్యగా మారింది. అయితే జుట్టు తెల్లబడడానికి కారణాలు, నివారణ గురించి ఈరోజు తెలుసుకుందాం.

పౌష్టిక ఆహార లోపం- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడానికి కారణము సరైన పోషకాహారం తీసుకోకపోవడం. ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ ను తీసుకోకపోవడం ద్వారా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ముఖ్యంగా విటమిన్ బి12 నల్లగా ఉంచడానికి సహాయపడేది. కాబట్టి మీ శరీరంలో ఈ పోషకం లోపం ఉన్నట్లయితే మీ జుట్టు త్వరగా తెల్లగ అవుతుంది.

సూర్య రష్మీ ఎక్కువగా- ఎక్కువగా ఎండలో పనిచేసే వారికి జుట్టు తెల్లబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఎండలో ఉండడం ద్వారా చర్మం పైన ఎండ ఎక్కువగా పడి మెలను ఉత్పత్తి ఆగిపోతుంది. దీని ద్వారా జుట్టు తొందరగా తెల్లబడుతుంది.

జెనిటిక్స్- కొంతమందిలో జన్యుపరంగా కూడా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.

Health Tips: ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల కలిగే లాభాలు 

ధూమపానం- ధూమపానం చేసే వారికి జుట్టు త్వరగా తెల్లబడుతుంది. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదం. అధికంగా ధూమపానం చేసే వారిలో శరీరంలో పోషకాలు అన్నీ కూడా శరీరానికి అందవు దీనివల్ల జుట్టు తెల్లగా అయిపోయి రాలుతూ ఉంటుంది.

స్ట్రెస్- ఒత్తిడితో బాధపడే వారిలో కూడా జుట్టు తొందరగా తెల్లబడుతుంది. ఎక్కువ ఆందోళన ఒత్తిడికి గురయ్యే వారిలో మైటోకాండ్రియా తగ్గిపోవడం ద్వారా జుట్టులో ఉన్న ప్రోటీన్ తగ్గిపోతుంది. దీని ద్వారా జుట్టు తొందరగా తెల్లగా అవుతుంది.

చికిత్స- జుట్టును తెల్లగా అయ్యే తొలి దశలోనే గమనించి కొన్ని చిట్కాలను పాటించినట్లయితే మీకు తెల్ల జుట్టు సమస్య నుండి ఈజీగా బయటపడతారు. కొబ్బరి నూనెలో కాస్త ఉల్లిపాయ రసం వేసుకొని ప్రతిరోజు తలకు రాసుకుంటే మీ జుట్టు నల్లగా అవుతుంది. గుంటగలగర ఆకును పేస్టులాగా చేసుకుని తలకు అప్లై చేసుకుంటే ఇది కూడా మీ జుట్టును నల్లగా చేస్తుంది.  కొబ్బరి నూనెలో కరివేపాకు పేస్టును వేసుకొని మరిగించి ఆ నూనెను మీరు హెయిర్ ఆయిల్ గా మసాజ్ చేసుకుంటే తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది. ఉసిరి ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉసిరిగా పేస్ట్ ని కొబ్బరి నూనెలో వేసుకొని వేడి చేసి ఆ నూనెను తలకు అప్లై చేసుకుంటే మీరు తెల్ల జుట్టు సమస్య నుండి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి