ఈరోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరి చుట్టూ తెల్లబడుతుంది వాతావరణంలోని కాలుష్యం వల్ల, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల, మార్కెట్లో వచ్చే రకరకాలైన షాంపూలు, నూనెలు, వాడటం వల్ల కూడా మీకు తెల్ల జుట్టు వస్తుంది. ఒకప్పుడు 60 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే తెల్ల జుట్టు కనిపించేది. కానీ ఇప్పుడు స్కూల్ కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి అందరికి కూడా తెల్ల జుట్టు అనేది సమస్యగా మారింది. ఈ సమస్య నుండి బయటపడడానికి ఒక రెమెడీ గురించి తెలుసుకుందాం.
Health Tips: ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు నీటిని తాగడం ద్వారా 5 సమస్యలను ...
కలోంజి గింజలు ఉపయోగించి మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. కలోంజి గింజలు వీటినే ఉల్లి విత్తనాలు అని అంటారు. ఇవి చూడడానికి నువ్వుల లాగా ఉంటాయి. ఇవి అన్ని ఆయుర్వేదం షాపులలో సూపర్ మార్కెట్లో లభిస్తాయి. వీటిని ఒక 50 గ్రామ్స్ తీసుకుని వేయించి పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నూనెను తీసుకొని దానిలో ఈ కలోంజి గింజ పొడిని వేసి కాసేపు మరిగించుకోవాలి. తర్వాత దీన్ని వడగట్టుకుని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. ఈ నూనెను మీరు ప్రతిరోజు అప్లై చేసుకున్నట్లయితే మీకు తెల్ల జుట్టు సమస్య అనేది తగ్గిపోతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలోంజిలో చాలా ఉన్నాయి. ఈ రెమెడీ ద్వారా మీకు కొత్తగా వచ్చే వెంట్రుకలు కూడా నలుపు వెంట్రుకలు వస్తాయి. దీని ద్వారా మీరు తెల్ల జుట్టు నుండి సమస్య నుండి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.