మేకప్ లిస్ట్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది లిప్ స్టిక్. లిప్ స్టిక్ అప్లై చేయకుండా ఏం మేకప్ కూడా పూర్తికాదు. మహిళలను మరింత అందంగా కనిపించేందుకు తరచుగా అనేక రకాలైనఉత్పత్తులను మార్కెట్లో తీసుకొస్తారు. వీటి అధిక వినియోగం వల్ల అది మన ఆరోగ్యానికి కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వీటిని ఎక్కువ కాలం ఉపయోగించడం ద్వారా మన చర్మం పైన ఇన్ఫెక్షన్స్ను తీసుకువస్తాయి. ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. లిప్ స్టిక్ తయారు విధానంలో కార్సినోజెనిక్ అనేటువంటి రసాయనాన్ని కలుపుతారు ప్రమాదాన్ని పెంచుతుంది.
హానికర రసాయనాలు: లిప్ స్టిక్ కాస్మెటిక్ ఉత్పత్తుల్లో అనేక రకాలైనటువంటి హానికర రసాయనాలను కలుపుతారు ఇది మన హార్మోన్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది దీని ద్వారా దీని ద్వారా అనేక రకాలైనటువంటి చర్మవ్యాధులు మరియు అనేక రకాల ఆరోగ్య సమస్యలు చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Health Tips: ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా ...
చర్మ క్యాన్సర్ ప్రమాదం: ఈ రసాయనాలు కలిపిన ఉత్పత్తులను ఎక్కువ కాలం ఉపయోగించడం ద్వారా మనకు చర్మకేన్సర్ వచ్చేటువంటి ప్రమాదం పెరుగుతుంది లిప్ స్టిక్ లో కాసినోజనిక్ అనేటువంటి రసాయనాన్ని ఎక్కువగా వాడుతారు ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి వీలైనంత తక్కువగా వాడితే మంచిది. దీనిలో క్రోమియం సీసం అల్యూమినియం వంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలుపుతారు ఈ పదార్థాలు మన చర్మానికి తాకినప్పుడు అనేక రకాలైనటువంటి చర్మ సంబంధమైన రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎక్కువ ఉపయోగించవద్దు: వీలైనంత తక్కువ సార్లు లిప్ స్టిక్ ను ఉపయోగించండి దీని ద్వారా ఈ సమస్యను మనం తగ్గించవచ్చు. లైట్ కలర్స్ తీసుకోండి. లిప్స్టిక్లను డార్క్ లిప్స్టిక్ లో ఎక్కువ రసాయనాలు కలుపుతారు. కాబట్టి లైట్ షేడ్స్ ని తీసుకున్నట్లయితే ఇందులో తక్కువ రసాయనాలు ఉంటాయి. కాబట్టి లిప్ స్టిక్ తీసుకునేటప్పుడు లైట్ తింటూ కలర్స్ ని ఉపయోగించడం మంచిది.
లిప్స్టిక్ వేసుకోవడానికి ముందు: లిప్ స్టిక్ వేసుకోవడానికి ముందు ఎల్లప్పుడూ మీ పెదవులను హైడ్రేట్ గా ఉంచుకోవాలి. దీనికోసం మీరు ఎల్లప్పుడూ చర్మం పొడి వారకుండా పగిలిపోకుండా కొబ్బరి నూనెను కానీ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత లిప్ స్టిక్ ని అప్లై చేసుకున్నట్లయితే దాని లిప్స్టిక్ లో ఉన్నటువంటి కెమికల్స్ అనేవి వాటి ప్రభావాన్ని మనం తగ్గించవచ్చు. దీని ద్వారా మీ పెదవులతో పాటు మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. లిప్ స్టిక్ ను అప్లై చేసుకోవడానికి ముందు తర్వాత కూడా మీ పెదాలను శుభ్రంగా చేసుకోండి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.