రుచి కోసం ఆహార పదార్థాల్లో ఉప్పును వినియోగిస్తూ ఉంటారు. అయితే అధిక ఉప్పును తీసుకోవడం వల్ల మనకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో పాటు అనేక జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రక్తపోటు శరీరంలో వాపు నీరసం వంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇవి ఈ సంకేతాలు ఒక్కొక్కసారి ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల మనము ఉప్పును తగ్గించడానికి ప్రయత్నించాలి. అధిక ఉప్పు తీసుకోవడం ద్వారా ఈ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
అధిక రక్తపోటు: మన శరీరంలో ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అది రక్తపోటు రక్తపోటును పెంచుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని ద్వారా మనకు గుండెకు సంబంధించిన జబ్బులకు కారణం అవుతుంది. అంతేకాకుండా తలనొప్పి తల తిరగడం తర్వాత గుండె కొట్టుకోవడంలో సమస్యలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే మీరు మీ శరీరంలో ఉప్పు శాతం పెరిగినట్లు కాబట్టి ఉప్పు తగ్గించుకుంటే మంచిది.
శరీరంలో వాపు: తరచుగా మన శరీరానికి ఉప్పు ఎక్కువ అయినట్లయితే మన శరీరంలో కాళ్లు చేతులు ముఖము నీరు ఏర్పడుతుంది. దీని ద్వారా శరీరంలో వాపు కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖంలో వాపు కనిపిస్తుంది. కాబట్టి ముఖం వాపు ఉబ్బినట్టుగా అనిపించడము కాళ్లు ఉబ్బినట్టుగా అనిపించడం అధిక సోడియం కు సంకేతం కాబట్టి దీన్ని మీరు ఉప్పు తగ్గించడం ద్వారా నియంత్రించవచ్చు.
అధిక దాహం: మీ శరీరంలో ఉప్పు శాతం ఎక్కువైనట్లయితే మీకు పదేపదే దాహం వేస్తుంది. ఎందుకంటే ఇది మన శరీరంలో ఉన్న నీటిని అన్నిటిని కూడా పీల్చుకోవడం ద్వారా మన శరీరము డిహైడ్రేషన్ కి గురవుతుంది.
Health Tips: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా.
నీరసం: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో అలసట బలహీనత నీరసము ఏర్పడతాయి. ఇది మన శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా సోడియం అధికం అవ్వడం వల్ల మన కండరాలను ఎముకలను బలహీనం చేస్తుంది. తద్వారా మనకు కళ్ళు తిరగడము నీరసం నిరసత్వగా అనిపిస్తుంది.
మూత్రం రంగు మార్పు: మన శరీరంలో ఉప్పు పెరగడం ద్వారా మనం మూత్రం రంగు ముదురు పసుపురావుకి మారుతుంది. ఇది మనకి కిడ్నీలను కూడా దెబ్బతీస్తుంది. సాధారణ రంగు కంటే కూడా ముదురు రంగులో వస్తే మన శరీరంలో ఉప్పు స్థాయి పెరిగిందని సంకేతం కాబట్టి మీరు ఉప్పు తగ్గించుకోవడం మంచిది. లేకపోతే మూత్ర విసర్జన సమయంలో కూడా మంట నొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.