
Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడే వారికి చక్కటి ఔషధాలు మన వంటింట్లోనే అధికంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు అధిక బరువు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ పెరగడం రక్తపోటు, గుండె జబ్బుల వంటి సమస్యలు కేవలం బరువు అధికంగా ఉండడం ద్వారానే వస్తాయి. బరువు తగ్గడం ద్వారా అనేక రకాల జబ్బులను తగ్గించుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారు ఎన్ని ప్రయోగాలు చేసిన వారి బరువును తగ్గించడంలో ఎప్పుడు విఫలం అవుతూనే ఉంటారు. వీరు వ్యాయామం చేయడము, డైట్ మెయింటైన్ చేసిన కొన్నిసార్లు సరైన ఫలితాలు రావు. అటువంటి వారు కొన్ని వంటింట్లో ఉండే మసాలా దినుసులతోటి ఈజీగా బరువు తగ్గొచ్చు. అందులో ప్రముఖ స్థానంలో ఉన్నది. దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలు అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్క పొడిని ప్రతిరోజు కషాయం రూపంలో తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. దాల్చిన చెక్క కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. ఇది వేడి చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కనుక మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు దాల్చిన చెక్క పొడిని కషాయం రూపంలో తీసుకోవడం ద్వారా బరువు నెలలోనే నాలుగు కేజీల వరకు తగ్గుతారు.
Health Tips: తరచుగా గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారా,
కషాయం తయారీ విధానం- దాల్చిన చెక్కను కొద్దిగా వేయించుకొని పొడి చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని ప్రతి రోజు ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు తీసుకొని నీటిలో కలిపి కషాయం లాగా చేసుకుని వడకట్టుకొని తాగాలి. ఇలా తాగడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుంది. మన శరీరానికి కావాల్సిన మంచి కొలెస్ట్రాలను అందిస్తుంది. దీని ద్వారా గుండె జబ్బులు మధుమేహం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అయితే దాల్చిన చెక్కను వాడేటప్పుడు కాస్త వేడి చేస్తుంది. కనుక మజ్జిగను ఎక్కువగా ఆహారంలో తీసుకోవడం ద్వారా ఈ సమస్యను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. లేకపోతే కాస్త కడుపులో మంట వికారంగా అనిపిస్తుంది. గర్భిణీలు దీనికి దూరంగా ఉండాలి. ఇది వేడి చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి బిడ్డ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి దీన్ని గర్భిణీలు తీసుకోకుండా ఉంటేనే మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి