vitamin b12

మన శరీరానికి విటమిన్ బి 12 అనేది చాలా ముఖ్యమైన విటమిన్. ఇది మన శరీరానికి అనేక రకాలైన అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తుంది. దీని లోపం వల్ల మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముందుగా ఈ విటమిన్ బి12 లోపం ఉన్న వాళ్లకు కళ్ళు పసుపుగా మారడం అనే లక్షణం కనిపిస్తుంది. విటమిన్ బి12 లోపం గురించి దాని లక్షణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

విటమిన్ బి12 ఉపయోగాలు

విటమిన్ బి12 సైనకోబాలమిన్ అని కూడా అంటారు. ఇది మన శరీరంలోని ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ముఖ్యంగా నాడీ వ్యవస్థ పని ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. మన శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల రక్తం తగ్గడం మానసిక ఆరోగ్యం పైన, మెదడు పనితీరు పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.

విటమిన్ బి టువెల్ లోపం వల్ల కళ్లకు కలిగే నష్టాలు.

చూపు మసకబారడం- విటమిన్ బి12 లోపం వల్ల కళ్ళు మసకబారతు ఉంటాయి. మీరు దృష్టిని కేంద్రీకరించలేకపోవడం వల్ల ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి బి12 విటమిన్ ను లోపం లేకుండా చూసుకోవాలి.

Health Tips: మెంతుల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కళ్ళు పొడిబారడం-  విటమిన్ బి12 లోపం వల్ల కళ్ళు పొడి వారినట్లు అనిపిస్తుంది. కళ్ళలో తేమ తగ్గినట్లుగా అనిపించి దురద చిరాకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. కామెర్ల విషయంలోనే కాకుండా విటమిన్ బి12 లోపం వల్ల కూడా మీ కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. కాబట్టి మీ కళ్ళు పసుపు రంగులోకి మారినప్పుడు రక్త పరీక్ష చేయించుకుని ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకుంటే మంచిది.

కంటి నరాల సమస్య- ఒక్కొక్కసారి కంటి నరాల సమస్య కూడా విటమిన్ బి 12 లోపం వల్ల కూడా కలుగుతుంది. విటమిన్ లోపం పెరిగే కొద్దీ ఆ వ్యక్తిలో కంటి కండరాల సమస్య మరింతగా పెరుగుతుంది. ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే మీరు వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

విటమిన్ బి12 లోపాన్ని తగ్గించుకోవడానికి ఏం తినాలి-విటమిన్ బి 12 లోపం  అధిగమించడం కోసం మనము ఆహార పదార్థాలలో ముఖ్యంగా మాంసం చేపలు, గుడ్డు, చికెన్ చేపలు వంటి వాటిని తీసుకోవాలి. పాలు పెరుగు చీజ్ వంటివి కూడా విటమిన్ బి12 లోపాన్ని తగ్గిస్తాయి. కోడిగుడ్లలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకున్నట్లయితే విటమిన్ బి12 లోపం నుండి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.