irregular periods

Health Tips: చాలామంది మహిళల్లో పిరియడ్స్ సక్రమంగా రావు దీనివల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఒక్కొక్కసారి వీరికి పిసిఒడి లేదా పిసిఓఎస్ వంటి సిండ్రమ్స్ ఉండడం ద్వారా లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి  ఇర్ రెగ్యులర్ గా వస్తాయి. అయితే దీనివల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కొంతమంది ఎక్కువ వ్యాయామం చేసే వారిలో కూడా పీరియడ్స్ లేటుగా వస్తాయి. కొంతమందిలో రక్తం సరిగ్గా లేనప్పుడు పిరియడ్స్ లో హెచ్చుతగ్గులు ఉంటాయి. గర్భధారణ సమయంలో కూడా పీరియడ్స్ లేటుగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా పాలిచ్చే తల్లుల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలు తీసుకునే వారిలో కూడా రుతుక్రమం సరిగ్గా రాదు. అయితే ఇవన్నీ సమస్యలు లేనప్పటికీ కూడా కొంతమంది మహిళల్లో ఈ సమస్య ఉంటే కొన్ని చిట్కాల ద్వారా రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. కొన్ని ఆహారాల ద్వారా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బొప్పాయి- పీరియడ్స్ లేటుగా వచ్చేవారిలో బొప్పాయి పండును తీసుకోవడం ద్వారా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. బొప్పాయి పండు లో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ ను నియంత్రిస్తుంది. దీని ద్వారా పీరియడ్స్ సకాలంలో వస్తాయి.

అల్లం- అల్లం ని వినియోగించడం ద్వారా మహిళల్లో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఇది అనేక రకాల మానసిక సమస్యలను ,పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. టైంకి పీరియడ్స్ రానప్పుడు అల్లాని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి..

Health Tips: తరచుగా గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారా,

దాల్చిన చెక్క- దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. పి సి ఓ ఎస్, పి సి ఓ డి వంటి సమస్యలు కూడా తగ్గించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. పీరియడ్స్ గనక నెలలు నెలలుగా రాకుండా ఉన్నవారు దాల్చిన చెక్కర తీసుకోవడం ద్వారా సరైన సమయంలో పీరియడ్స్ వస్తాయి.

పైనాపిల్- పైనాపిల్ కూడా పీరియడ్స్ ను రెగ్యులర్గా రావడంలో సహాయపడుతుంది. చాలామందికి నెలలు నెలలుగా ఆగిపోయిన పీరియడ్స్ ను క్రమబద్ధీకరించడంలో పైనాపిల్ సహాయపడుతుంది. పైనాపిల్ను తినడం ద్వారా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి