source: pixabay

చాలామంది రాత్రి నిద్రపోయే సమయంలో కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వీటిని తగ్గించుకోవడం కోసం మసాజ్ అనేది చాలా ఉపయోగపడే పరిష్కారం.  జీవన శైలిలో మార్పులు ఒత్తిడి ఆందోళన శ్రమ అధికంగా ఉండడం కూడా ఈ కాళ్ళ నొప్పులకు కారణాలు కావచ్చు. వీటిని మసాజ్ చేసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు . నువ్వుల మసాజ్ చేసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం..

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది- రాత్రిపూట కాళ్లకు నువ్వుల నూనె పట్టించి ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేయడం ద్వారా కాళ్ళలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరాన్ని భాగాలకు కూడా రక్తాన్ని సరఫరా చేయడం వల్ల కండరాలకు మరింత ఆక్సిజన్ అందుతుంది. దీని వల్ల కాళ్ల నొప్పులు తగ్గుతాయి. కండరాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా తగ్గిపోతాయి. ఈ రక్తప్రసరణ వల్ల శరీరంలో ఉన్న పోషకారులు అన్నీ కూడా అందుతాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. మీరు ఎప్పుడు కూడా తాళ్ల నొప్పులు లేకుండా ఎనర్జిటిక్ గా ఉండాలి అనుకుంటే ప్రతిరోజు మసాజ్ చేసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది.

నరాలకు విశ్రాంతినిస్తుంది- నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసుకొని కాళ్లకు మసాజ్ చేసుకోవడం ద్వారా కాళ్ళ నరాలకు ఉపశమనం కలుగుతుంది. రాత్రిపూట కాళ్లలో నొప్పి అధికంగా అవుతుంది. అలాంటప్పుడు ఇలా చేయడం ద్వారా ఆ నొప్పి తగ్గుతుంది. రెగ్యులర్గా మసాజ్ చేసుకోవడం ద్వారా శిరలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీని ద్వారా అలసట ఒత్తిడి తగ్గుతాయి. మసాజ్ చేసుకోవడం ద్వారా కండరాలు వదులుగా అవుతాయి. దీని ద్వారా నొప్పి నుండి ఉపశమనాన్ని పొందుతారు.

Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా

కండరాలకు బలాన్ని ఇస్తుంది- నువ్వులతో నూనెతో కాళ్ళను మసాజ్ చేసుకోవడం ద్వారా కండరాలు బలపడతాయి. అంతేకాకుండా గాయాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రెగ్యులర్గా ఇలా మసాజ్ చేసుకోవడం ద్వారా కండరాల్లో ఉన్న నొప్పులు, అలసట, తగ్గి మీరు చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. పాదాలలో ,కాళ్లలో శక్తిని నింపుతుంది.

మానసిక ఒత్తిడి తగ్గుతుంది- రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసే కాళ్లకు మసాజ్ చేసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడే ఆందోళన కూడా తగ్గి గాడ నిద్రకు దారితీస్తుంది. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

ఎలా మసాజ్ చేసుకోవాలి..

ప్రదేశంలో కూర్చుని గోరువెచ్చని నువ్వుల నూనె తీసుకొని దాన్ని చేతులకు అప్లై చేసుకొని ఒత్తిడి లేకుండా కాళ్లకు మసాజ్ చేసుకోండి. ప్రతి కాలుకి 3నుండి 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న తర్వాత కాసేపు విశ్రాంతినివ్వండి. ఇది నిద్రపోయే ముందు చేసినట్లయితే మీకు చక్కటి ఫలితాలను అందిస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలసట ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి