వర్షాకాలం వచ్చిందంటే చాలు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరినీ కూడా ఇన్ఫెక్షన్స్ చుట్టూ ముడతాయి. తరచుగా జలుబు, దగ్గు ,జ్వరం ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి లక్షణాలు కూడా పెరిగిపోతాయి. అటువంటి అప్పుడు కొన్ని ఆహార పదార్థాల ద్వారా మనము ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు .ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో ఈ సూపర్ ఫుడ్స్ తోటి మీ ఇమ్మ్యూనిటీ అమంతం పెరుగుతుంది.
బ్రకోలి: ఇందులో క్యాల్షియం, ఐరన్, విటమిన్స్, మెగ్నీషియం అంటే పోషకాలు అనేకం ఉన్నాయి. ఇది వర్షాకాలంలో బ్రకోలిని తీసుకోవడం ద్వారా మీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. తద్వారా ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడతారు.
స్ప్రౌట్స్: మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం ద్వారా కూడా మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంట్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంటుంది. మొలకెత్తిన విత్తనాల్లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బి12 ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగడం ద్వారా ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం అంటే సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి ప్రతిరోజు మీరు స్ప్రౌట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి.
సిట్రస్ పండ్లు: ఉసిరి, నిమ్మ, దానిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్ వల్ల మీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దీంట్లో ఉన్న సి విటమిన్ మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తుంది. మీరు మీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి బయటపడతారు.
బాదం: బాదం లో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్పరస్, మెగ్నీషియం ,జింక్ అధికంగా ఉంటాయి. బాదం మీరు రెగ్యులర్గా ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇమ్యూనిటీ పెరగడం ద్వారా మనలో వచ్చే ఇన్ఫ్లమేషన్స్ అన్నిటిని కూడా తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు బాదాం ను సాయంత్రం పూట ఒక పది నుంచి 15 నానబెట్టుకుని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తో పాటు తీసుకున్నట్లయితే మీ శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీ వస్తుంది. దీని ద్వారా ఇన్ఫెక్షన్ల బారి నుండి బయటపడతారు.
Health Tips: పుచ్చకాయ గింజలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ...
ప్రోటీన్ ఆహార పదార్థాలు: ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కూడా ఈ వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి బయటపడతారు. ముఖ్యంగా చికెన్, కోడిగుడ్డు , పాల ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా మీ శరీరాన్ని కావలసినంత ప్రోటీన్ అందుతుంది. ప్రోటీన్ మన కండరాల శక్తికి రక్తం ఏర్పడడానికి సహకరిస్తుంది. ఇది మీరు ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పెరుగుతుంది దీని ద్వారా మీకు ప్రోటీన్ లోపం సమస్య నుంచి కూడా బయటపడతారు. ఇమ్యూనిటీ పెరగడం ద్వారా మన శరీరంలో వచ్చే కండరాల బాపులు నొప్పులు ఎనీ మియా సమస్యల నుంచి కూడా బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.