ప్రస్తుత సమయాల్లో మన జీవన శైలిలో మార్పుల కారణంగా కొలెస్ట్రాల్ సమస్య అందరిలో కూడా కనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల మనకు గుండె సంబంధం సమస్యలు ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలన్న దానిపైన సమస్య తలెత్తుతుంది .ముఖ్యంగా వారు బ్రౌన్ రైస్ తినాలా వైట్ రైస్ తినాలా అన్న ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించిన గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వైట్ రైస్ ను తగ్గిస్తే మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లో అధికంగా ఉంటాయి. బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తీసుకోవడం ఉత్తమం.
Health Tips: ఇర్ రెగ్యులర్ పిరియడ్స్ తో బాధపడుతున్నారా
ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది: షుగర్ పేషెంట్స్ వైట్ రైసులు తీసుకుంటే ఇందులో కార్బోహైడ్రేట్ లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీని ద్వారా కొలెస్ట్రాల్ పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ ఉన్నషుగర్ పేషెంట్స్ వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తీసుకోవడం చాలా ఉత్తమం. బ్రౌన్ రైస్ తో పాటు బార్లీ వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి బ్రౌన్ రైస్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
ఎంత పరిమాణంలో తీసుకోవాలి: బ్రౌన్ రైస్ అయినా వైట్ రైస్ అయినా తీసుకునే దాని పరిమాణం పైన కాస్త శ్రద్ధ పెట్టాలి. ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ప్రభావితం అవుతాయి. అందుకని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం గా ప్రతి మూడు గంటలకు ఒకసారి తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారు తాజా పండ్లను, కూరగాయలను, తృణధాన్యాలను తీసుకోవాలి ఆహారాన్ని కంటే కూడా ఈ పండ్లు తీసుకోవడం ద్వారా వాళ్ళ కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఆహారంలో మార్పులతో పాటు వ్యాయామం చేయడం, ధ్యానం, మెడిటేషన్, జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండడం, ఒత్తిడికి దూరంగా ఉండడం వంటి ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం, దీని ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి