మహిళల్లో ఎక్కువగా ఫ్యాట్ బెల్లీ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా అసలు ఏ కారణాల వల్ల వస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఆడవారిలో పొట్ట దగ్గర కొవ్వు చాలా పేర్కొని పోతుంది. దీనికి తగ్గించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా కొన్నిసార్లు అది ఎటువంటి ప్రభావాన్ని చూపించదు అయితే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం కోసం పరగడుపున ఈ డ్రింక్ తాగితే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు మొత్తం కూడా తగ్గుతుంది. అయితే అసలు బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి వల్ల- మహిళలు చిన్న చిన్న కారణాలను కూడా ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కాటిసలు ఎక్కువగా విడుదలవుతుంది. దీనివల్ల చాలా మందిలో బాన పొట్ట ఏర్పడుతుంది. ఎక్కువగా విడుదలవడం వల్ల నిద్రలేమి అనేది ఏర్పడుతుంది. నిద్రలేమి వల్ల బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. అయితే బెల్లీ ఫ్యాట్ లో తగ్గించుకోవడం కోసం యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. మెరుగైన నిద్రను ఉండేలాగా చూసుకుంటే కార్టీసాల్ ఉత్పత్తి తగ్గుతుంది. ప్రతిరోజు గ్రీన్ టీ ని తీసుకోవడం ద్వారా ఇందులో ఉన్న ఆంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివల్ల మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
Health Tips: ఖాళీ కడుపుతో లీచీ తింటే ప్రాణాపాయం...
PCOD - మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య ఈసీ ఓడి ఈ సమస్య ఉన్నవారిలో శరీరంలో హార్మోన్లు డిస్టర్బ్ అయ్యి బెల్లీని పెంచుతాయి. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ని తగ్గనుచుకోవాలి. అనుకున్నప్పుడు దాల్చిన చెక్క టీ ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మీ హార్మోన్ బాలన్స్ అవుతాయి. ఇది మీ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ లో కూడా కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల pcod వంటి సమస్యలు తగ్గిపోయి బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.
థైరాయిడ్ వల్ల- కొంతమందిలో థైరాయిడ్ సమస్య వల్ల కూడా బాన పొట్ట ఏర్పడుతుంది. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. హార్మోన్ల ఇమ్బలెన్స్ వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ తక్కువైనప్పుడు ఇది ఏర్పడుతుంది. దీనికోసం ధనియాలతో చేసిన కషాయాన్ని తీసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది. అంతేకాకుండా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది..
డెలివరీ తర్వాత- కొంతమంది మహిళల్లో డెలివరీ తర్వాత బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో మార్పులు వస్తాయి. బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. డెలివరీ తర్వాత బెల్లీ ఫ్యాట్ ఉన్నవారికి పుదీనాను టీ రూపంలో చేసుకొని తాగినట్లైతే యాంటీ ఆక్సిడెంట్లు ఉండి పొట్టను తగ్గిస్తాయి. ఇన్ఫ్లమేషను మరియు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
కడుపుబ్బరం- కొందరి మహిళల్లో బెల్లీ ఫ్యాట్ ఉండదు కానీ కడుపుబ్బరం వల్ల వాళ్లకి పొట్ట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంజైమ్స్ తక్కువగా విడుదల అవడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది. అయితే దీని తగ్గించుకోవడం కోసం సోప్ గింజలతో చేసిన టీ తాగినట్లయితే తగ్గుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి