
తమలపాకు మన అందరికీ తెలుసు. శ్రావణమాసంలో వాయనంగా ఇస్తారు. అంతేకాకుండా తమలపాకుని ఆహారం జీర్ణం కావడం కోసం కిల్లిగా వేసుకుంటారు. ప్రతిరోజు పరిగడుపున రెండు తమలపాకులు తిన్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: తమలపాకుని ఖాళీ కడుపుతో తీసుకుంటే అందులో ఉన్న విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, రకాలైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు రెండు తమలపాకులు తిన్నట్లయితే మన రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల భారీ నుండి బయటపడతాము.
Health Tips: పసుపు డ్రాగన్ ఫ్రూట్ తో మీ కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గుతుంది .
జీర్ణ వ్యవస్థ కు: ఖాళీ కడుపుతో రెండు తమలపాకులు ప్రతిరోజు తిన్నట్లయితే మన జీర్ణ వ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణ క్రియను సక్రమంగా చేస్తుంది. అంతేకాకుండా గెస్ట్ సమస్యలు మలబద్దకం, అజీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు రెండు తమలపాకులు తినడం ద్వారా మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
బరువు నియంత్రణ: ప్రతిరోజు రెండు తమలపాకులు తిన్నట్లయితే మన శరీరంలోని మెటబాలిజం రేట్లు పెంచి జీవ క్రియను సక్రమంగా చేస్తుంది. ఇది మన బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మన శరీరంలో అదనపు కొవ్వును తగ్గించడంలో తమలపాకులు సహాయపడుతుంది. దీని ద్వారా మన బరువు సులభంగా తగ్గించుకోవచ్చు.
చర్మానికి: ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్సు ,విటమిన్ ఏ మన చర్మానికి చాలా మేలు చేస్తాయి. మన చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో మొటిమలు ,వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మన దంతాలకు కూడా చాలా మంచిది నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది.
షుగర్ ను కంట్రోల్ చేస్తుంది: తమలపాకును ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన రక్తంలోని చక్కర స్థాయిలో అదుపులో ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు వల్ల మధుమేహ రోగులకు ఇది మేలు చేస్తాయి. మధుమేహ సంబంధ వ్యాధులతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే తప్పక ఫలితం ఉంటుంది.
గుండెకు మంచిది: తమలపాకులు మన గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె సంబంధ సమస్యలను తగ్గించడంలో కూడా మనకు సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే గుండెపోటు, గుండె సంబంధ జబ్బులు తగ్గిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.