ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు మనకు చెప్తారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలు- చేపలు తీసుకోకూడదు వీటిలో మెర్క్యురి ఉంటుంది. గర్భిణీలకు ప్రమాదం కాబట్టి గర్భిణీ సమయంలో చేపలు తీసుకోకపోవడం ఉత్తమం.
ఆల్కహాల్- గర్భధారణ సమయంలో ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా పిండం ఎదుగుదల సక్రమంగా ఉండకుండా గుండె, మెదడు సంబంధం వ్యాధులతో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భధారణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్కహాలు తీసుకోకూడదు.
కాఫీ టీలు, కూల్ డ్రింక్స్- కాఫీ టీలు, కూల్ డ్రింక్స్ ను ఎట్టి పరిస్థితుల్లో గర్భధారణ సమయంలో తీసుకోకూడదు. ఇందులో కెఫిన్ అధికంగా ఉంటుంది. అధికంగా కెఫిన్ తీసుకోవడం ద్వారా కడుపులో ఉన్న బిడ్డ జీవక్రియకు మంచిది కాదు వారిలో వీటిని జీర్ణం చేసుకునే ఎంజైమ్ లేనందుల వల్ల వారికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా.
ప్రాసెస్ ఫుడ్ తీసుకోకూడదు- ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఇది చాలా ప్రమాదం ఇందులో తక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. క్యాలరీల అధికంగా షుగర్ ఎక్కువగా ఉండటం ద్వారా మీకు బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో ఈ జంక్ ఫుడ్ కి ప్రాసెస్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.
మొలకెత్తిన గింజలు తీసుకోకూడదు- గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లో మొలకెత్తిన గింజలను తీసుకోకూడదు. ఇందులో సాల్మొనెల్ల, లిస్ట్రేరియా వంటి బ్యాక్టీరియాలో ఉంటాయి. దీని ద్వారా ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటివారు గర్భధారణ సమయంలో మొలకెత్తిన గింజలు తీసుకోకూడదు.
ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి.
గర్భధారణ సమయంలో ప్రోటీన్ ఐరన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను బాగా తీసుకోవాలి కూరగాయలు పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తృణధాన్యాలు, బీన్స్ వంటివి తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి