చలికాలంలో దగ్గు అనేది చాలా సాధారణమైన సమస్యగా చెప్పవచ్చు. అయితే వాతావరణం మార్పులతోటి జలుబు, దగ్గు వంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి గొంతులో కఫం సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా ఈ కఫం అనేది చాలా కాలం పాటు ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడం కోసం మనము ఇంట్లోనే ఉండే కొన్ని ఆహార పదార్థాల తోటి సమస్యను తగ్గించుకోవచ్చు .అవి ఏవి ఏమిటో తెలుసుకుందాం.
వేడి నీటి వేడి నీటిలో ఉప్పుతో పుక్కిలించడం- గొంతు నొప్పి ,గొంతులో కఫం ఎక్కువగా పేర్కొన్నప్పుడు వేడి నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం ద్వారా కఫం అంతా కూడా తొలగిపోతుంది అంతేకాకుండా గొంతు వాపు కూడా తగ్గుతుంది.
Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా
తులసి రసం- తులసి రసాన్ని తాగడం ద్వారా కూడా గొంతులో పేరుకుపోయిన కఫం తగ్గుతుంది. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది.
పసుపు పాలు- గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తీసుకోవడం ద్వారా గొంతులో పేరుకుపోయిన కఫం అంతా కూడా తొలగిపోతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది అనోవేరకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.
అలోవెరా- అలోవెరా జ్యూస్ కూడా గొంతులో పేరుకుపోయిన కఫాన్ని తగ్గిస్తుంది. అలోవెరా జ్యూస్ ను కాస్త తీసుకున్నట్లయితే పేరుకు పైన కఫాన్ని అంత కూడా బయటికి పంపించడంలో సహాయపడుతుంది.
ఆవిరి పట్టడం- ఎక్కువగా దగ్గు కఫం ఉన్నప్పుడు వేడినీటిలో కాస్త జండూబామ్ వేసుకొని ఆవిరి పట్టినట్లయితే కఫం అంతా కూడా బయటికి వచ్చేస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి