కేవలం సంవత్సరంలో వర్షాకాలంలో మాత్రమే లభించే కూరగాయ బోడ కాకరకాయ. దీనిని ఆ కాకరకాయ అని కూడా అంటారు. దీనిలో పోషక విలువలు చూస్తే చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. కూర, వేపుడు, పొడి చేసుకొని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు.
శాకాహారులకు ఇది ఒక అదృష్టంగా చెప్పవచ్చు. ఇందులో ఉన్న అద్భుతమైన రుచితో పాటు అనేక రకాలైనటువంటి పోషకాలు కూడా ఉన్నాయి. దీని తీసుకోవడం ద్వారా ఈ వర్షాకాలంలో వచ్చే వైరల్ ఫీవర్లు, బ్యాక్టీరియల్ ఫీవర్ ల, నుంచి అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా బయటపడవచ్చు.
Health Tips: కలబంద లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ ...
బోడ కాకరకాయ లో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, ఇందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం మెగ్నీషియం, పొటాషియం, విటమిన్, జింక్, కాపర్ వంటి పోషకాలు చాలా ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ వల్ల మన శరీరంలో వచ్చే వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మనకు మలబద్ధకం సమస్య గ్యాస్టిక్ సమస్య నుంచి బయటపడతారు.
చాలామంది పైల్స్ సమస్యతో బాధపడుతుంటారు. అటువంటివారు ఈ బోడ కాకరకాయ కూరను తీసుకున్నట్లయితే వారిలో ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా చాలామంది కామెర్ల వ్యాధితో కూడా బాధపడుతుంటారు. అటువంటి వారు కూడా ఈ బోడ కాకరకాయను దొరికిన టైం లో ఎక్కువగా తీసుకున్నట్లయితే మీకు ఈ సమస్య నుంచి కూడా బయటపడతారు. కేవలం రెండు మూడు నెలలు మాత్రమే లభిస్తుంది కాబట్టి దీనికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణ కూరగాయలతో పోలిస్తే దీని రేటు ఎక్కువే. అలాగే దీనిలో ఉన్న పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఈ సీజన్లో తీసుకున్నట్లయితే మనకు అనారోగ్య సమస్యల నుంచి కచ్చితంగా బయటపడతాం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.