ఈ మధ్యకాలంలో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువు, మధుమేహం, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు, బిపి సమస్యలతో ఉన్నవారు వారి డైట్లో నాన్ వెజ్ ఆహారంని పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే నాన్ వెజ్ ను తగ్గించుకోవడం లేదా మానివేయడం వల్ల ఆరోగ్యం పైన సానుకూల ప్రభావాలు చూపుతాయి.
నాన్ వెజ్మానివేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తీవ్రమైన జబ్బులు తగ్గిస్తుంది- నాన్ వెజ్ ను మానివేయడం లేదా దాన్ని తగ్గించడం ద్వారా అనేక రకాల తీవ్రమైన జబ్బుల నుంచి మనం బయటపడవచ్చు. ముఖ్యంగా గుండె జబ్బు ,అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి జబ్బుల ప్రమాదాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
అధిక బరువు- నాన్ వెజ్ ను అధికంగా తీసుకోవడం ద్వారా బరువు పెరిగే సమస్య తలెత్తుతుంది. అయితే తక్కువ నాన్ వెజ్ తీసుకునే వారిలో ఈ సమస్య తగ్గుతుంది. కాబట్టి వెజిటేరియన్ డైట్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నాన్ వెజ్ ను మానివేయడం ఉత్తమం.
Health Tips: ఒకరోజులో మన శరీరానికి ఎంత నీరు అవసరం అవుతుందో తెలుసా ...
జీర్ణ క్రియ మెరుగుపడుతుంది-వెజిటేరియన్ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరిచి మన గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే నాన్ వెజ్ తీసుకునే వారిలో ఈ సమస్య మరింత ఇబ్బందిని కలగజేస్తుంది. నాన్ వెజ్ ఆహారము జీర్ణం కావడానికి ఎనిమిది నుండి పది గంటల సమయం పడుతుంది. అటువంటి వారిలో కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి నాన్ వెజ్ కు బదులుగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్య సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది- నాన్ వెజ్ ,ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను మానివేయడం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదము తగ్గుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి