water

మన శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. అనేక రకాల జబ్బులు తగ్గించడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మన శరీరాన్ని ఎప్పుడు కూడా హైడ్రేట్ గా ఉంచడానికి నీరు చాలా అవసరం. అయితే మనం ప్రతిరోజు ఎంత నీరు తీసుకుంటున్నామో ఎంత నీరు తాగితే మనకు లాభాలు ఉంటాయి. తక్కువ నీరు త్రాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రోజులో ఎంత నీరు తాగాలి.

నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి రోజుకి రెండు నుండి మూడు లీటర్ల నీరు త్రాగాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి ఇది వారి వారి పనులను బట్టి వాతావరణను బట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా మారుతుంది. వేసవిలో అయితే ఎక్కువ చెమట పడుతుంది. కాబట్టి నీటి అవసరం పెరుగుతుంది. అదేవిధంగా చలికాలంలో అయితే తక్కువ దాహంతోటి తక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. అయితే మన శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ నీరు త్రాగడం ఇది చాలా హానికరం.

తక్కువ నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు.

జీర్ణ సమస్యలు- తక్కువ నీరుని తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలు పెరుగుతాయి. మన శరీరంలో తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు అటువంటి అప్పుడు టాక్సిన్స్ శరీరంలో పేర్కొంటాయి. దీనివల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగినంత నీరు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

డిహైడ్రేషన్- మనం రోజులో తీసుకోవాల్సిన దానికంటే తక్కువ నీరు తీసుకోవడం వల్ల మన శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి ఒక్కొక్కసారి కళ్ళు తిరగడం, గుండెజబ్బులు, మెదడు సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మన శరీరాన్ని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు తీసుకోవడం ఉత్తమం.

Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.

కిడ్నీలో రాళ్లు- తక్కువ నీరు తీసుకునే వారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీరు మూత్రపిండాల పనితీరును నిర్వహిస్తూ ఉంటుంది.

చర్మం పొడిబారుతుంది- తక్కువ నీళ్లు తీసుకోవడం వల్ల మన శరీరంలో తేమశాతం తగ్గిపోయి చర్మం పొడిబారుతుంది. దీనివల్ల నిర్జీవంగా మారుతుంది. చర్మంలో కణాలకు కచ్చితంగా నీరు అవసరం కాబట్టి నీరు తీసుకోవడం వల్ల మన శరీరంలో చర్మం పైన కూడా గ్లో వస్తుంది. మొటిమలు ముడతలు వంటి చర్మ సమస్యలు రాకుండా ఉంచుతుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్స్- తక్కువ నీరు త్రాగే వారిలో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో ఉన్న మలినాలను శుభ్రపరచడంలో నీరు సహాయపడుతుంది. మన శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు బాక్టీరియాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. టాక్సిన్స్ సరిగా బయటికి పంపలేవు. ఇది ఇన్ఫెక్షన్ పెంచుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి